హైదరాబాద్ మహా ప్రణాళిక…

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నగర అభివృద్ధికి అవసరమైన సమగ్ర మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు సంబంధిత శాఖలన్ని మార్చి 5 లోగా అవసరమైన వివరాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. కె. జోషి ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో హైదరాబాద్ నగర మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, వైద్య,ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, మెట్రోరైల్ యం.డి. ఎన్.వి.యస్ రెడ్డి, ఆస్కి అర్బన్ గవర్నన్స్ విభాగాధిపతి వి.శ్రీనివాసాచారి, జిహెచ్ఎంసి కమీషనర్ దానకిషోర్, టూరిజం శాఖ కార్యదర్శి బి.వెంకటేశం, పిసిసిఎఫ్ పి.కె.ఝా, పిసిబి సభ్యకార్యదర్శి సత్యనారాయణ రెడ్డి, ENC గణపతిరెడ్డి, GMR ప్రతినిధి కిషోర్, పోలీసు అధికారులు అనీల్ కుమార్, శివప్రసాద్ లతో పాటు మున్సిపల్, మెట్రోవాటర్ వర్క్స్, ఆర్.టి.సి, ఇరిగేషన్, పరిశ్రమలు, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు ASCI, మున్సిపల్ శాఖను హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలన్న నేపధ్యంలో ORR లోపల ఉన్న నగరం, ORR అవతల నుంచి ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ మద్యనున్న నగరం, రీజనల్ రింగ్ రోడ్ ఆవల మరో 5 కిలోమీటర్ల వరకు విస్తరించే నగరంగా విభజించి మంచినీరు, ట్రాఫిక్, భద్రత, శానిటేషన్, వైద్య, విద్యుత్, రవాణా, రోడ్లు, భద్రత, విద్య, క్రీడలు తదితర అంశాలకు సంబంధించి వచ్చే 30 ఏళ్ళను దృష్టిలో ఉంచుకొని ఆయా శాఖలు తమ వివరాలను అందిస్తే Concept paper ను రూపొందిస్తామని సి.యస్ తెలిపారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో పబ్లిక్ కన్వీనియన్స్ ను గవర్నెన్స్ మాడ్యూల్స్, ఇంటిగ్రేటేడ్ టౌన్ షిప్స్, పరిశ్రమలు, పచ్చదనం, రైల్ కనెక్టివిటి, తదితర అంశాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ప్రజా రవాణాకు అత్యధిక ప్రాధాన్యత ఉండాలన్నారు. వివిధ శాఖలన్నీ తమ సేవలను సమర్ధవంతంగా అందించటానికి Unified Authority ఏర్పాటు చేసే విషయమై ఆలోచించాలన్నారు.
మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ మాట్లాడుతూ వివిధ శాఖలు సమర్పించిన సమాచారం ఆధారంగా తయారు చేసిన Concept note పై వివిధ జాతీయ, అంతర్జాతీయ కన్సల్ టెన్సీలు, రీసోర్స్ పర్సన్స్, ప్రముఖ అంతర్జాతీయ నగరాల నిపుణుల సలహాలతో 6 నెలల్లోగా మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తామన్నారు. ప్రజలకు నాణ్యమైన, ఆహ్లాదకరమైన జీవనాన్ని అందించటమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. అన్ని రకాల సేవలు ఓకేచోట అందించేలా Integrated Township ల అభివృద్ధి ప్రణాళికలను మాస్టర్ ప్లాన్ లో చేరుస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న Best Practices ను పరిగణలోకి తీసుకుంటామన్నారు.
వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా నాలుగు వైపుల ఆసుపత్రి నెట్ వర్క్ ను ఏర్పాటు చేసేలా చూడాలన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి సూచనల ఆధారంగా నగర అభివృద్ధి వ్యూహాన్ని, మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తామని ఆస్కి ప్రతినిధి శ్రీనివాసాచారి తెలిపారు. ప్రజలకు వివిధ శాఖల ద్వారా మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేలా చూస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పద్ధతులను పరిశీలిస్తామన్నారు.
టూరిజం శాఖ కార్యదర్శి బి.వెంకటేశం మాట్లాడుతూ క్రీడలు, టూరిజం, హోటల్స్, సాంస్కృతిక కార్యక్రమాల అంశాలపై వివరాలు సమర్పిస్తామన్నారు.
జిహెచ్ఎంసి కమీషనర్ దానకిషోర్ మాట్లాడుతూ నగర అభివృద్ధికి అవసరమైన చర్యలకు ఇబ్బంది కలగకుండ చట్టాలను రూపొందించాలన్నారు.
మెట్రోరైల్ యం.డి ఎన్.వి.యస్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలలోని నగరాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని టౌన్ ప్లానింగ్ ను తయారు చేయాలన్నారు.

About The Author