3007 శివరాత్రి3007 శివరాత్రి స్పెషల్ బస్సులు…
3007 శివరాత్రి3007 శివరాత్రి స్పెషల్ బస్సులు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విజయవాడ,
02 03 2019.
మార్చి 4 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ ఏడాది 3007 శివరాత్రి స్పెషల్ బస్సులు నడిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు ఈ బస్సులు నడపబడతాయి.
ప్రధానంగా గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి పొందిన కోటప్పకొండ జాతర కు గుంటూరు జిల్లా నుండి 578 స్పెషల్ బస్సులు, అదేవిధంగా ఒంగోలు నుండి 322 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. కర్నూలు జిల్లాలో శ్రీశైలం యాగంటి ఇతర పుణ్య క్షేత్రాలకు 419 బస్సులు నడుపుతున్నారు. అలాగే చిత్తూరు జిల్లాలో మొగిలి,తలకోన కైలాసకోన , సదాశివ కోన మొదలైన పుణ్య క్షేత్రాలకు 331 బస్సులు,కడప జిల్లాలో బ్రహ్మంగారిమఠం పుణ్యక్షేత్రాలకు 348 బస్సులు నడిపేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
గత ఏడాది శివరాత్రి స్పెషల్ సర్వీసుల తో పోల్చి చూస్తే ఈ ఏడాది ప్రయాణికుల కోసం సుమారుగా 737 వరకు అదనపు బస్సులు నడపనున్నారు.
యాత్రికులు భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సినదిగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆపరేషన్స్ విభాగం మనవి చేస్తున్నది. ఈ సందర్భంగా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అధికారులు వారికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం పట్ల సత్వరం స్పందించే తీరులో మెలగాలని, డ్రైవర్లు కండక్టర్లు ప్రయాణికుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) శ్రీ కేవీఆర్కే ప్రసాద్ కోరారు.గత ఏడాది శివరాత్రి స్పెషల్ సర్వీసుల తో పోల్చి చూస్తే ఈ ఏడాది ప్రయాణికుల కోసం సుమారుగా 737 వరకు అదనపు బస్సులు నడపనున్నారు.
యాత్రికులు భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సినదిగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆపరేషన్స్ విభాగం మనవి చేస్తున్నది. ఈ సందర్భంగా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అధికారులు వారికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం పట్ల సత్వరం స్పందించే తీరులో మెలగాలని, డ్రైవర్లు కండక్టర్లు ప్రయాణికుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) శ్రీ కేవీఆర్కే ప్రసాద్ కోరారు.