ఖరారయిన తెదేపా లోక్ సభ అభ్యర్దులు:-
*ఖరారయిన తెదేపా లోక్ సభ అభ్యర్దులు:-*
1. శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు
2. విజయనగరం – అశోక్ గజపతిరాజు
3. అమలాపురం – హరీష్
4. విజయవాడ – కేశినేని నాని
5. కడప – ఆదినారాయణ రెడ్డి
6. గుంటూరు – గల్లా జయదేవ్
7. నంద్యాల – ఎస్పీ వై రెడ్డి కుటుంబ సభ్యులు
8. బాపట్ల – శ్రీరామ్ మాల్యాద్రి
9.నరసరావుపేట – రాయపాటి సాంబశివరావు/ రాయపాటి రంగారావు
10. విశాఖపట్నం – భరత్ (కీ.శే||ఎంవిఎస్ మూర్తి గారి మనవడు)
11. కాకినాడ – సునీల్
13.రాజమండ్రి – భాస్కర రామారావు
14.అనకాపల్లి – సబ్బం హరి
15. అరకు – కిషోర్ చంద్రదేవ్
16.కర్నూల్ – కోట్ల సూర్యప్రకాష్
17. అనంతపురం – జేసి పవన్ రెడ్డి
18. రాజంపేట – సాయిప్రతాప్
19.ఒంగోలు – నండూరి సాంబశివరావు (మాజీ డీజిపీ)
20.మచిలిపట్నం – కొనకళ్ళ నారాయణ
21.హిందుపూర్ – నిమ్మల క్రిష్టప్ప
22. ఏలూరు – బోళ్ళ రాజీవ్.
*పెండింగ్…*
నెల్లూరు, తిరుపతి, చిత్తూరు.
*దేవినేని ఉమ ప్రెస్ మీట్*
ప్రముఖ ఇంజనీర్, ప్రభుత్వ మాజీ సలహాదారు శివరామకృష్ణయ్య జయంతి ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా చేస్తున్నాం… రాయలసీమ రతనాలసీమ కావడానికి యన్టీఆర్, చంద్రబాబు హయాంలో ఆయన ఎన్నో సూచనలు చేశారు.
రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్ ఢిల్లీ వెళ్లి ఏదేదో మాట్లాడాడు…
దేశంలో బిజెపి యన్‌డిఏ, వారికి వ్యతిరేక ఫ్రంట్ లు ఉన్నాయి, కానీ
కేసిఆర్ ఫిడేల్ ఫ్రంట్ ఎక్కడా కనిపించడం లేదు
ఒక పత్రిక నిర్వహించిన కాన్‌క్లేవ్ లో అమరావతి అక్కడే ఉంటుందని జగన్ చెప్పలేక పోయాడు
ఇద్దరు మంత్రులు వెళ్లి ఆహ్వానిస్తే కనీసం బయటకు రాలేదు
అమరావతి ని భ్రమరావతి అని ప్రచారం చేస్తూ భ్రమల్లో బతుకుతున్నాడు
మట్టి, నీరు ఇచ్చిన మోడిని ప్రశ్నించే ధైర్యం జగన్ కు లేదు
ఇడుపులపాయకు ఎపి రాజధానిని తరలించాలని జగన్ కుట్రలు చేస్తున్నాడు
ప్రజా సమస్యల పై స్పందించలేని జగన్ కు ప్రజలను ఓట్లు అడిగే హక్కు కూడా లేదు…
మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ లలో అమరావతి గురించి చేసిన ప్రచారం అంతా అబద్దమని తేలిపోయింది
కేంద్రం నుంచి నిధులు ఇవ్వని మోడిని నిలదీస్తుంటే.. కనీసం మోడిపై నోరు కూడా మెదపలేని దుస్థితి నీది
ఓటమి భయంతోనే ఓట్లు తీసేశారంటూ టిడిపి పై బురద జల్లుతున్నారు
చనిపోయిన వ్యక్తుల ఓట్లు తీస్తే దానిని రాజకీయం చేయడం సిగ్గుచేటు
ముఖ్యమంత్రి పదవి జగన్ స్వప్నం అంట…
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు దోచుకున్నావు
16నెలలు జైలుకెళ్లావు, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళతావు
మొన్న మోడి వచ్చి హామీలు ఇవ్వకుండా పోతే ఇదేమిటని జగన్ అడగలేకపోయాడు
జగన్ వెయ్యి కోట్లకు కేసిఆర్ కు అమ్ముడుపోయి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు
ఇప్పటికే ఐదు వందల కోట్లు జగన్ చేతికి చేరాయి
సొంతం గా చంద్రబాబు ను ఎదుర్కోలేక కేసిఆర్, మోడి, ఒవైసి ల తో చేరి జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నాడు
ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో కేసిఆర్ అండతో టిడిపి అనుకూల వ్యాపారుల పై దాడులు చేస్తున్నారు
ఎంపి అభ్యర్థులు గా నిలబడే వ్యక్తులే వారికి టార్గెట్
దమ్ముంటే ముసుగు తీసి బహిరంగ పోటీ కి మీరంతా వస్తే ప్రజలే బుద్ది చెబుతారు
పేదల కోసం పెన్షన్ లు చంద్రబాబు ఇస్తే .. ఒక కులానికే ఇచ్చారని జగన్ దుర్మార్గం గా మాట్లాడుతున్నాడు
పసుపు కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు చెక్ లు ఇస్తే చెల్లని చెక్ లు అంటారా…
వచ్చే ఎన్నికలలో చెల్లని పార్టీగా ఉండే వైసిపి నేతలకు అన్నీ చెల్లనవిగానే కనిపిస్తాయి
ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు రెండు వేల భృతి ఇచ్చాం
పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా ను కాపాడటమే కాక, రాయలసీమ కు నీరిచ్చిన ఘనత చంద్రబాబుది
పట్టిసీమ వల్ల జిడిపి 44వేల కోట్ల పెరిగింది
కేంద్రం నుంచి సాయం అందకపోయినా మన సిఎం పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తున్నారు
ఎపి బెస్ట్ స్టేట్ గా మూడో స్థానంలో ఉందంటే అది చంద్రబాబు పని తీరుకు నిదర్శనం
పోలవరం పై జగన్ కుట్రతో కవిత, ఒరిస్సా నుంచి కేసులు వేయించారు
పోలవరం ను అడ్డుకునేలా కేసులు వేసిన కేసిఆర్ తో జగన్ కలిసి చేస్తున్న కుట్రలను ప్రజలు అర్దం చేసుకోవాలి
నీకు, నీ తండ్రికి సాధ్యం కాని పని మేము చేసి చూపాము
కడప జిల్లాకు, పులివెందుల కు చంద్రబాబు నీరిచ్చి చూపారు
కనీసం పోలవరం సందర్శించకుండా రాజకీయం చేస్తున్నాడు
పోలవరం పనులు చూస్తే.. మాట్లాడటానికి ఏమి ఉండదని జగన్ కు భయం
ఢిల్లీవెళ్లి సిగ్గు లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడతావా
ప్రతిపక్షంలో ఉండమని ప్రజలు తీర్పు ఇస్తే అసెంబ్లీని ఎగ్గొట్టావు
ప్రజల సమస్యలు పట్టవు కానీ, అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకున్నావు
కనీస అవగాహన లేకుండా జగన్, వైసిపి నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు
కాంగ్రెస్ హయాంలో సాధ్యం కాని ప్రాజెక్టు లను మేము పూర్తి చేసి చూపించాం
చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని అంగీకరించలేని మానసిక వ్యాది తో జగన్ ఉన్నాడు
అందుకే ప్రభుత్వం చేసే ప్రతి పని పైనా విషం చిమ్ముతున్నారు
రాయలసీమ రైతాంగాన్ని అడిగితే టిడిపి చేసిన పనులు నీకే తెలుస్తాయి
ఎవరెన్ని కుట్రలు చేసినా చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమ పధకాలతో ప్రజలు టిడిపి కే పట్టం కడతారు…