గుంటూరు తూర్పు నుంచి ఆలీ సీటు ఖరారు…?
*గుంటూరు తూర్పు నుంచి ఆలీ సీటు ఖరారు…?
ప్రముఖ నటుడు ఆలీ రాజకీయ రంగ ప్రవేశానికి లైన్ క్లియర్ అయింది… మొదటినుంచి తెలుగుదేశం పార్టీ తో మంచి అనుబంధమే ఉన్నాకూడా తన టిక్కెట్టు విషయంలో హామీ ఇవ్వకపోయేసరికి, అటు జనసేనానిని, మరో అడుగు ముందుకు వేసి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను కలిసి ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం ప్రచారం జరిగింది. తన స్వస్థలం రాజమండ్రి లేక, తన సామాజిక వర్గం ఎక్కువగా ఉండే గుంటూరు నుంచి పోటీ చేయాలని భావించిన ఆలీ కి తన నోటి దురుసు తనంతో కొంత భంగపాటు ఎదురైందనే చెప్పవచ్చు… ఎమ్మెల్యే టిక్కెట్టే కాదు ఎవరు మంత్రి పదవి ఇస్తాను అంటే ఆ పార్టీలో చేరుతాను అన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఆలీని అన్నిపార్టీలు దూరంపెట్టాయి…
అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎలాగైనా అదికారాన్ని నిలబెట్టుకోవాలని ఉన్న తేదేపా… ఆలీ సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది, అందులో భాగంగానే… ఇటీవల విజయవాడలో జరిగిన ఆలీ సన్మాన వేడుకకు ముఖ్య అతిధిగా చంద్రబాబునాయుడు రావడం, ఆలీ కూడా తేదేపా తోనే ఉంటానంటూ అధినేతకు విన్నవించుకోవడంతో… ముస్లిం ఓటర్లు అధికంగా కల గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని చంద్రబాబు ఖరారు చేసినట్టు, సన్నిహిత వర్గాల సమాచారం.
ఈ నేపథ్యంలో నే ఆలీ గుంటూరు నుంచి ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకొన్నారు, అయితే తెలంగాణలో ఓటు ఉన్నదంటూ అధికారులు అభ్యంతరం వ్యక్తంచేయగా… అక్కడి ఓటును తొలగించేందుకు తన సమ్మతిని తెలియచేస్తూ… అవసరమైన పత్రాలను అదికారులకు ఇచ్చారు ఆలీ….
ఇప్పటివరకు అటు వెండితెరమీద, అప్పుడప్పుడు బుల్లితెర పై నవ్వులు పూయించిన ఈ హాస్యరేడు కు వివాదాలు కొత్తవేంకావు… చటుక్కున ఏదోఒకటి అనడం, నాలుక కరచుకొవడం ఈ మధ్య పరిపాటి అయిన ఈ హాస్యనట చక్రవర్తి, రాజకీయ రంగులరాట్నాన్ని ఏమేరకు ప్రభావితం చేస్తాడో… వేచి చుడాలి…
*– స్రవంతీ చంద్ర*