తెలంగాణలో… తెరమరుగు కానున్న తేదేపా ప్రాతినిధ్యం…

తెలంగాణలో… తెరమరుగు కానున్న తేదేపా ప్రాతినిధ్యం…

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు… రాష్ట్ర అసెంబ్లీ లో తెదేపా ప్రాతినిధ్యాన్ని కనుమరుగు చేస్తోంది… అధికార టీఅర్‌ఎస్ ఆకర్ష్ కు హాట్రిక్ ఎమ్మెల్యే వికెట్ పడింది. ఇక రేపోమాపో మిగిలిన ఆ ఒక్కరు తమ గూటికి చేరక తప్పదు అంటోంది తెరాస.

రాష్ట్ర విభజన తర్వాత కొలువుదీరిన మొట్టమొదటి అసెంబ్లీ లో 18స్థానాలను గెలిచి, ఆపై ఒక్కొక్కరుగా అటుతర్వాత మూకుమ్మడిగా పార్టీ మారినా… తెదేపాకు వినయ విధేయ రాముడిగా… ఏ ఒత్తిళ్ళు, ప్రలోభాలకు లోను కాకుండా ఉండిన ఏకైక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య…

మొన్నటి ఎలక్షన్లలో అంతటి కేసీఅర్ ప్రభంజనాన్నీ తట్టుకొని, తిరిగి తన స్థానాన్ని నిలుపుకోవడమే కాక జిల్లాలోని అశ్వారావుపేట ను కైవసం చేసుకొవడంలో ప్రధాన భుమిక పోషించి, హాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు సంపాదించారు సండ్ర…

ప్రస్తుత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో, మిత్ర పక్ష ఎమ్‌ఐఎమ్ తో కలిసి ఐదు స్థానాలకు అభ్యర్దులను ప్రకటించింది అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఒక అభ్యర్ధిని బరిలో నిలిపింది…. తెదేపా అభ్యర్థుల ఓట్లు కీలకమైన ఈ పరిస్థితుల్లో… మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించింది అధికార పార్టీ… అయితే ఈ సారి గురి తప్పలేదనే చెప్పవచ్చు…

నిన్న ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి, తెరాస అధినేత ను కలిసిన సండ్ర వెంకట వీరయ్య…. నేడు పార్టీ మార్పు పై క్లారిటీ ఇచ్చేసారు… నియోజక వర్గ అభివృద్ధి కోసం తాను తేదేపా ను వీడుతున్నానని, కార్యకర్తలతో చర్చించి తెరాస లో చేరే తేదీ ప్రకటిస్తానని పేర్కొన్నారు…

— స్రవంతీ చంద్ర

About The Author