పచ్చి అబద్దాలు…
పచ్చి అబద్దాలు
బాల్ కోట దాడిపై కేంద్ర ప్రభుత్వ సమాచారం పచ్చి ఆబద్దాలా? అంతర్జాతీయ మీడియా మొత్తం ముక్తకంఠంతో ఇచ్చిన సమాచారం అవుననే చెబుతోంది. ప్రధాని ఏమీ చేయరని అరుస్తున్న కుక్కలకు ధీటైన జవాబు, ఇది శాంపిలే అంటూ రెచ్చిపోయిన హోంమంత్రి దేశ ప్రజలకు దీనిపై ఏమి సమాధానం చెబుతారు.
అంతర్జాతీయ మీడియా…బీబీసీ, న్యూయార్క్ టైమ్స్, గార్డియన్ …ఇలా అనేక సంస్థల సమాచారాన్ని ఎలాచూడాలి.IAF గురి
తప్పింది. ఒక్క ఉగ్రవాది కూడా చనిపోలేదు. ఒక్కరికే గాయాలు. అక్కడ జైష్ ఉగ్రవాద శిబిరమే లేదు. అనే సమాచారానికి పూర్తి విరుద్ధంగా 300 ఉగ్రవాదులు హతం, జైష్ ఉగ్రవాద సంస్థ మఠాష్, వాయుసేన ఆపరేషన్ సక్సెస్ అంటూ కేంద్రప్రభుత్వం, మీడియా దేశ ప్రజలను మభ్య పెడుతూ ఊదరగొట్టేశాయి. దీన్ని ప్రజల భావోద్వేగాలను రెచ్చగట్టే నీచప్రవృత్తి కాదని ఎలా చెప్పగలం. అలా అని దీనికి భిన్నంగా పాకిస్థాన్ నాయకులకో, ఇందిరాగాంధి, ఆ తర్వాత నాయకులకో పవిత్రతను ఎలా ఆపాదించగలం. వంచనలో అందరూ ఒకరిని మించిన వారు ఒకరు కావడవల్లే కాశ్మీర్ ఇలా మండుతోంది. అందరూ తమ స్వార్థ ప్రయోజనాలకు ఈమంటల్లో చలికాచుకుంటూ లక్షలాది మంది ప్రజలను పొట్టన పెట్టుకుంటున్నారు. కళ్ళెదురుగా ఉన్న పరిణామాలే ఈ వాస్తవాన్ని మనకు చెపుతున్నాయి.