ఓట్ల తొలగింపు పై ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది వ్యాఖ్యలు…
ఓట్ల తొలగింపు పై ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది వ్యాఖ్యలు…
టీడీపీ యాప్‌లో ఉన్న ఓటర్ల జాబితా అన్ని పార్టీలకూ ఇచ్చేదేనన్న ఏపీ ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది
తెలంగాణ పోలీసులు ఏ ఉద్దేశంతో డేటా చోరీ అంటున్నారో కానీ… ఆంధ్రప్రదేశ్ అధికారవర్గం మాత్రం ఈ విషయమై అసహనానికి గురవుతోంది. అసలు టీడీపీ యాప్‌లో.. ప్రజలకు సంబంధించి.. రహస్యంగా ఉంచాల్సిన సమాచారం… ఏముందో చెప్ప కుండా… సైబరాబాద్ సీపీ సజ్జనార్ రాజకీయ నాయకుడిలా వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రధానమైనది ఓట్ల తొలగింపు.టీడీపీ యాప్ ద్వారా ఓటర్ల తొలగింపు జరుగుతోందన్నట్లుగా మీడియా సమావేశంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పుకొచ్చారు. ఏపీలో ఓట్ల తొలగింపుపై యాభై కేసులు నమోదయ్యాయన్న సమాచారం ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై.. ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ అమరావతిలో స్పందించారు. అన్ని రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితా ఇస్తామని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు ఇచ్చే ఓటర్ల జాబితాను ఎడిట్ చేయలేరని, ఏకపక్షంగా ఎక్కడ ఓట్లు తొలగించారో నిరూపించాలని ద్వివేదీ వ్యాఖ్యానించారు.
ఐటీ గ్రిడ్ దగ్గర ఉన్న ఓటర్ల జాబితా… వారు చూసుకోవడానికే తప్ప.. ఓటర్ల డేటా బేస్‌ని మార్చడం సాధ్యపడదన్నారు. సజ్జనార్ చెబుతున్నట్లుగా.. ఓటర్ల డేటాబేస్‌లో… ఎడిట్ చేసుకోగల ఓటర్ల లిస్ట్.. టీడీపీ యాప్ లో ఉంటే ఎక్కడ నుంచి వచ్చిందో సజ్జనారే చెప్పాలని ద్వివేదీ వ్యాఖ్యానించారు. నిబంధనల ప్రకారం ప్రతీ రాజకీయ పార్టీకి ఓటర్ల జాబితా అందుతుందని, అందులో మార్పులు చేర్పులు సాధ్యం కావని స్పష్ఠంచేసారు…
మార్పులు చేర్పులు ఎదైనా ఎన్నికల అధికారులే చేస్తారు. టీడీపీ యాప్ ద్వారా ఓటర్లను తొలగించారన్నట్లుగా… సజ్జనార్ వ్యాఖ్యలు చేయడంతో.. ఏపీ ఎన్నికల అధికారుల్లో కలకలం రేగింది. సైబరాబాద్ సీపీనే ఆ తరహా వ్యాఖ్యలు చేయడంతో… తన నిజాయితీనే శంకిస్తారా… అని ద్వివేదీ కలత చెందారని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు…. ఆ డేటా ఎక్కడి నుంచి వచ్చిందో బయటపెట్టాలని ఆయన వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు.
నిజానికి తెలుగుదేశం పార్టీపై డేటా విషయంలో రాజకీయంగా ఆరోపణలు చేస్తున్నారని .. అందరూ అనుకుంటున్నారు కానీ… అది మెల్లగా అధికారుల మీదకు వస్తోంది. రాజకీయ పార్టీలు ఆరోపణలు చేసుకున్నంత కాలం, దీనిపై ఈసీ కానీ.. ఇతరులు కానీ పెద్దగా పట్టించుకోలేదు అయితే ఏకంగా ఇందులో తెలంగాణ పోలీసులు జోక్యం చేసుకోవడం .. నేరుగా.. ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని చెప్పడంతో.. ఏపీ సీఈవో స్పందించారు. ఇప్పుడు దీనిపై సైబరాబాద్ కమిషనర్ స్పందించాల్సి ఉంది. ప్రైవేటు కంపనీలో నిక్షిప్తమై ఉన్న సమాచారం ఏమిటో.. అది ఎక్కడ్నుంచి వచ్చిందో.. ఆయన తేల్చాల్సి ఉంది. రానున్న రోజుల్లో ఇది ఏపీ, తెలంగాణ సివిల్ సర్వీసెస్ అధికారుల మధ్య పోరాటంలా మారే పరిస్థితి కనిపిస్తోంది.
రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తాయి… ఏదైనా తప్పు జరిగితే.. అది పూర్తిగా అధికారుల మీదకే వస్తుంది. వైఎస్ హయాంలో ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు నేటికీ… కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితే ఇందుకు కారణం.
— స్రవంతీ చంద్ర