ఆంధ్రప్రదేశ్ డేటా చోరీ పై ప్రత్యేక సిట్… తెలంగాణ ప్రభుయత్వ సంచలన నిర్ణయం…

*ఆంధ్రప్రదేశ్ డేటా చోర పై ప్రత్యేక సిట్… తెలంగాణ ప్రభుయత్వ సంచలన నిర్ణయం…*

గత కొన్ని రోజులుగా… రెండు తెలుగు రాష్ట్రాల నడుమ మాటల యుద్దానికి తెరతీసిన ఐటీ గ్రిడ్ డేటా చోరీ కేసును, సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ప్రత్యేక సిట్ ను ఏర్పాటుచేసి, తదుపరి విచారణ బాధ్యతలనుబ అప్పగించింది తెలంగాణ సర్కార్…

ఈ సిట్ బృందంలో సైబర్ క్రైం డీసీపి రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, డిఎస్పీ రవికుమార్, ఏసిపి శ్రీనివాస్ తో పాటు మరో ఇద్దరు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులను నియమిస్తూ తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకొంది.

హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును ఈ సిట్ కు బదిలీ చేయనున్నారు. తెలంగాణ డిజీపి స్వీయ పర్యవేక్షణలో… ఆయన కార్యాలయంలోనే సిట్ కు ప్రత్యేక గది కేటాయించనున్నారు.

— స్రవంతీ చంద్ర

About The Author