బాబు పాలిటి ఆపద్భాంధవుడు… బాల సుబ్రహ్మణ్యుడు…?

బాబు పాలిటి ఆపద్భాంధవుడు… బాల సుబ్రహ్మణ్యుడు…?

మొన్నీమధ్య వచ్చిన అరవింద సమేత… సినిమాలో హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేయడానికి వాడిన పదం… టార్చ్‌బేరర్… ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు అనుకొంటున్నారా…?

రాష్ట్ర విభజన తర్వాత, నారా చంద్రబాబునాయుడు సారధ్యంలో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2015లో ఓటుకు నోటు రూపంలో ఎదురైన గడ్డు పరిస్థితుల నుంచి, తెరవెనుక అన్నీ తానై, తిరుగులేని పక్కా ఆధారాలతో ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి, తెలంగాణ సర్కార్ కూడా కాదనలేని పరిస్థితిని కల్పించడం ద్వారా… బాబు గారికి దొరికిన టార్చ్‌బేరర్ అధికారిగా … అనధికారిక ప్రశంసలు అందుకొన్న సీనియర్ ఐపీఎస్ అధికారే బాలసుబ్రహ్మణ్యం అనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో లేకపోలేదు…

అందుకే… ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్ గా ఉన్న ఈ ముక్కుసూటి అధికారి పై నోరు పారేసుకొన్న సొంత పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే ల చేత క్షమాపణలు చెప్పించారు బాబుగారు అని పేర్కొనే రాజకీయ విమర్శకులకు కొదవే లేదు….

2019 సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ సమయంలో… కల్వకుంట్ల వారి, డేటా చోరీ అనే రిటర్న్ గిఫ్ట్ కేసు పుణ్యమా అని మరోసారి ఆ బాలసుబ్రహ్మణ్యేశ్వరుడినే…. నమ్ముకొన్నారు నారా వారు అని పొలిటికల్ టాక్…

— స్రవంతీ చంద్ర

About The Author