3D గురించి వినని వారు ఉండరు. అసలు ఈ D – డైమెన్షన్ గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం…

3D గురించి వినని వారు ఉండరు. అసలు ఈ D – డైమెన్షన్ గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం.
ఆధునిక శాస్త్రం విశ్వాన్ని space-time గా కొలుస్తుంది. వాటికి సంబంధించిన ఎన్నో ప్రతిపాదనలు ఉన్నాయి. అన్నింటిలో ఎంతో ప్రఖ్యాతి చెందిన థియరీ “సూపర్ స్ట్రింగ్” అని. అటువంటివే M-థియరీ అని , బోసోనిక్ స్ట్రింగ్ థియరీ అని మరి కొన్ని ప్రాచుర్యం పొందిన ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ సూపర్ స్ట్రింగ్ థియరీ ప్రకారం విశ్వానికి కనీసం 10D – 10 రకరకాల డైమెన్షన్లు ఉన్నాయి అని చెబుతుంది. M-థియరీ ప్రకారం 11D. ఈ డైమెన్షన్ లు ఎలాంటివో ఒక సారి చూద్దాం.
1-D పొడవు (length)
2-D ఎత్తు (height )
3-D లోతు (depth )
4-D time, ఒక వస్తువు ఎంత సేపు ఒక స్థానం లో ఉండగలిగిందో
5-D Possible Worlds, మనకన్నా కొంత విభిన్నమైన ప్రపంచం
6-D A Plane of All Possible Worlds With the Same Start Conditions; విభిన్నమైన ప్రపంచాలు అన్నీ ఒకే సమతలంలో ఒకే సమయానికి ప్రారంభం అవ్వడం (బిగ్ బాంగ్ లాంటిది )
7-D A Plane of All Possible Worlds With the different Start Conditions; విభిన్నమైన ప్రపంచాలు అన్నీ ఒకే సమతలంలో వివిధ సమయాలలో ప్రారంభం అవ్వడం
8-D A Plane of All Possible Worlds, Each With Different Start Conditions, Each Branching Out Infinitely; విభిన్నమైన ప్రపంచాలు అన్నీ ఒకే సమతలంలో వివిధ సమయాలలో ప్రారంభం అయ్యి, వివిధ ఆకృతులలో నిరవధికంగా పెరగడం
9-D All Possible Worlds, Starting With All Possible Start Conditions and Laws of Physics; విభిన్నమైన ప్రపంచాలు అన్నీ అన్ని సమతలాలలో వివిధ సమయాలలో, వివిధ సాధ్యమైన ఆకృతులలో ప్రారంభం అయ్యి నిరవధికంగా పెరగడం, కానీ భౌతిక సూత్రాలకు లోబడి వుండడం
10-D Infinite Possibilities – లెక్కలేనన్ని ప్రపంచాలు , ఒక నిర్దుష్టమైన ప్రణాళిక లేకుండా పెరిగి పెద్దవ్వడం
11D M-థియరీ ప్రకారం ఒక నిర్దుష్ట ప్రణాళిక ద్వారా లయం కూడా అవ్వడం.

ఇప్పుడు మనకు చెప్పిన ఏకాదశ రుద్ర తత్త్వం దీనికి దగ్గరగా వుంది. అసలు ఆ జ్యోతి స్వరూపుడైన ఆనందనిలయుడు వీటికి ఆది. ఆయన అనాది. ఆయన సనాతనుడు. ఆద్యంత రహితుడు. ఆయన ధ్యాన శ్లోకంలో…

“ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాణ్డ మావిస్ఫురత్ జ్యోతిః స్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతైః |
అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకామ్ జపన్ ధ్యాయేదీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రో2భిషించేచ్చివం ||”

శివ తత్త్వం పాతాళం నుండి లెక్కలేనన్ని భువన బ్రహ్మాండాలను ఆ జ్యోతి రూపం ఇముడ్చుకుంది, అని చదువుకుంటాం.
అదే విషయం దేవీభాగవతంలో త్రిమూర్తులకు అమ్మవారు లెక్కలేనన్ని బ్రహ్మాండాలు దర్శింప చేస్తూ ఆవిడ ఉండే మణిద్వీపానికి తీసుకు వెళ్తుంది. ఇటువంటి ఎన్నో బ్రహ్మాండాలు పుడుతూ ఉంటాయి, లయం అవుతూ ఉంటాయి. ఒకొక్క బ్రహ్మాండానికి ఒకొక్క త్రిమూర్తులు, కొన్ని అప్పుడే పుట్టినవి, కొన్ని లయం అవుతున్నవి ఇలా..

About The Author