అద్భుతమైన కథ. తప్పక చదవండి….

అద్భుతమైన కథ. తప్పక చదవండి.

ఒక సాధువు నడిచి వెళుతూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు..

ఎదురుగా వున్న ఇంట్లోని గృహస్థుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు.
సాధువుకి మంచి భోజనం పెట్టి, చీకటి పడింది కదా ఈ పూటకి ఇక్కడే వుండమని కోరాడు ఆ ఇంటి యజమాని.
మాటల్లో తన కష్టసుఖాలు ముచ్చటిస్తూ, యజమాని,
” ఏమిటో నండీ ! సంసారంలో సుఖం లేదండీ..మీజీవితమే హాయి !! అన్నాడు
వెంటనే ఆ సాధువు ” అయితే నా వెంట రా ! నీకు మోక్ష మార్గం చూపిస్తాను ” అన్నాడు.
యజమాని కంగారుపడుతూ.
” అలా ఎలా కుదురుతుంది ??
పిల్లలు చిన్నవాళ్ళు.. వాళ్ళను పెంచి పెద్ద చేయాలి కదా !!” అన్నాడు.
సాధువు మాట్లాడలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి.
ఆ సాధువు మరల అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూ‌సి ఆగాడు. ఆయన్ని చూసి యజమాని సాదరంగా ఆహ్వానించి, అతిథి మర్యాదలు చేశాడు.మాటలలో సాధువు అన్నాడు, ” పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు కదా నా వెంట రా! నీకు మోక్ష మార్గం చూపిస్తాను ” యజమాని తడబడుతూ ” ఇప్పుడే కాదు స్వామీ ! పిల్లలు స్థిరపడాలి…
వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి …..” అన్నాడు.
ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి. సాధువు మళ్లీ అదే…. యజమాని ఆతిథ్యం… సాధువు అదే మాట ….. యజమాని జవాబు కొంచెం విసుగ్గా..” పిల్లలకి డబ్బు విలువ తెలియదు.. అందుకని నేను దాచినంతా ఆ చెట్టు కింద పాతిపెట్టాను..వీలు చూసుకుని చెబుతాను. ఒక పెద్ద ఇల్లు కట్టాలి.. మీలాగా నాకు ఎలా కుదురుతుంది ” అన్నాడు..
ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి
సాధువు మళ్లీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళి పోతుండగా ఆ యజమాని కొడుకు గమనించి ఆహ్వానించాడు .
అతను తమ తండ్రి మరణించాడని చెప్పాడు.. సాధువు కి కొంచెం బాధనిపించింది.
ఆతిథ్యం స్వీకరించి బయటికి వచ్చాడు.. చెట్టు కింద ఒక కుక్క కూర్చుని వుంది యజమాని అనుమానంగా దాని వంక చూశాడు..
సందేహంలేదు యజమాని కుక్కగా పుట్టాడు.. సాధువు మంత్రజలం దాని మీద జల్లి ,
” ఏమిటి నీ పిచ్చి మోహం ??? ? గా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా ?? నా వెంట రా.. నీకు మోక్ష మార్గం చూపిస్తాను ”
అన్నాడు.. యజమాని ” ఆ మాట మాత్రం వినలేను..
ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు ఎవరూ దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా ” అన్నాడు.
మళ్ళీ కొన్నాళ్ళకి సాధువు ఆ దారిన వస్తూ ఆ ఇంటి వైపు చూశాడు . కుక్క కనపడలేదు పక్కవారిని అడిగితే అది పోయిందని చెప్పారు.అయినా సాధువు అనుమానంగా చుట్టూ చూస్తుంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది.. పరీక్షగా చూసాడు ఖచ్చితంగా ఆ యజమాని మళ్ళీ ? గా…
మంత్రజలం చల్లి, ” ఇంకా ఈ ఇంటిని వదిలి వెళ్ళవా ???
నాతో………….
……..” అన్నాడు
ఆ ఒక్క మాట మాత్రం అనకండి. నా సొమ్ము పిల్లలకి కాకుండా ఇతరులకి దక్కనీయకుండా చూడాలి కదా అన్నాడు దీనంగా..
సాధువు వెంటనే అతని ఇంట్లోకి వెళ్లి , అతని కొడుకులతో ” మీ నాన్న ఆ చెట్టు కింద దాచిపెట్టాడు. కానీ జాగ్రత్త! అక్కడ పాము ఉంది ” అన్నాడు.అనగానే కొడుకులు ఎగిరి గంతేసి,,

కర్రలు తీసుకుని బయలుదేరారు. తన కొడుకులే తనను కర్రలతో చావగొడుతుంటే అతను దీనంగా సాధువు వంక చూశాడు
కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది

నీతి
గృహస్థాశ్రమం లో బాధ్యతలు తప్పవు కాని మోహబంధాలు ఎంత గట్టిగా మనం కట్టేసుకోవాలి అనే వివేకం చాలా అవసరం.

ఇహమే కాదు పరం గురించి కూడా మనం తప్పనిసరిగా ఆలోచించాలి …. !!!మనలోని స్వార్ధం,గర్వం మంచుబిందువులా కరిగిపోవాలే తప్ప…….

అగ్నిలా మనల్ని దహించివేయకూడదు……..

మనలోని మంచితనం,ప్రేమగుణం పువ్వులా ప్రతిరోజు వికాశించాలే కానీ……..

ఎడారిలా మనల్ని ఒంటరి చేయకూడదు……..

ఇదే మనకి శనేశ్వరడు తెలియచేస్తాడు!!!!!!!ఎంతటి బ్రహ్మజ్ఞానులకైనా, విషయ వాంఛలు ఉండటం వల్ల వారు ఆ రుణాన్ని, ఆ కర్మానుబంధాన్ని తీర్చుకోవడం కోసం ఎన్నో జన్మలు ఎత్తవలసి వస్తుందనడానికి ఉదాహరణ జడభరతుని వృత్తాంతం. #జడభరతుడు రుషభుడనే రాజుకు కుమారుడు. రాజపుత్రుడుగా పుట్టినా, బాల్యం నుంచి విషయ వాంఛలకు అతీతంగా, దైవభక్తి కలిగి ఉండేవాడు. అందువల్ల అతనిని జడభరతుడని పిలిచేవారు. (జఢత్వం అంటే దేనికీ చలించకపోవడం అనే అర్థం ఉంది. అంతేకానీ, జడలు కలిగి ఉండటం వల్ల కాదు)రుషభుని అనంతరం జడభరతుడు తనకు ఇష్టం లేకపోయినా, రాజ్యపాలన చేపట్టవలసి వచ్చింది.

ఎన్నో సంవత్సరాలపాటు ప్రజానురంకజమైన పాలన అందించాడు. ఆయన పాలనలో ప్రజలు ఏ లోటూ లేకుండా హాయిగా ఉన్నారు. పాలన చేస్తూనే, జపధ్యానాలలో మునిగి తేలేవాడు. దేనినీ నిర్లక్ష్యం చేసేవాడు కాదు. చివరకు వృద్ధాప్యం మీదపడడంతో ఆయన పాలన బాధ్యతలను తన కుమారులకు అప్పగించి, ప్రజాజీవనానికి దూరంగా ఒక నదీతీరానికి వెళ్లి, అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకుని, ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. నిశ్చలమైన, నిర్మలమైన మనస్సుతో జన్మరాహిత్యాన్ని కోరి చేసే ఆయన తపస్సు శ్రీహరిని మెప్పించింది.

ఇక మోక్షం అనుగ్రహించాలనుకున్నాడు. ఇంతలో జరిగిన ఒక చిత్రమైన సంఘటన భరతుడి జీవితాన్ని మలుపు తిప్పింది. జడభరతుడికి ప్రతిరోజూ నదిలో స్నానం చేసిన తర్వాత, ఒడ్డునే కూర్చుని ధ్యానం చేసుకోవడం అలవాటు. ఒకరోజు ఆయన అలా ధ్యానానికి కూర్చున్నాడు. అదే సమయంలో నిండు చూలింత అయిన లేడి ఒకటి అక్కడ నీళ్లు తాగడానికి వచ్చింది. దానికి దగ్గరలో నుంచి ఒక పులిగాండ్రింపు వినపడింది. సరిగ్గా అప్పుడే పెద్దపెట్టున పిడుగు పడింది. ఈ రెండు సంఘటనలకు తీవ్రంగా బెంబేలెత్తిపోయింది ఆ లేడి. భయంతో వణికిపోతూ, ఒక్క గంతు వేసింది. ఆ గంతుకు లేడికి అప్పటికప్పుడు ప్రసవం జరిగిపోయింది. లేడి మాత్రం నీటిలో మునిగి చచ్చిపోయింది.

దూరాన కూర్చుని ఇది గమనిస్తున్న జడభరతుడు అక్కడికి చేరుకునేలోపు అప్పుడే పుట్టిన లేడిపిల్ల కూడా నదిలో మునిగిపోతూ కనిపించింది. దాంతో ఆయన ఒక్క అంగలో దాన్ని అందుకుని, చేతుల్లోకి తీసుకున్నాడు. కళ్లు కూడా తెరవని ఆ పసిదాన్ని చూసేసరికి ఆయనలో వాత్సల్యం కలిగింది. దిక్కులేని ఆ పసికూనను కొన్నాళ్లు పెంచి, అది కాస్త పెద్దయ్యాక తిరిగి అడవిలో వదిలేద్దామనుకున్నాడు. తన పర్ణశాలకు తీసుకుని వెళ్లి, దానికి సపర్యలు చేశాడు. లేత గడ్డిపరకలు తినిపించాడు. అది కోలుకోవాలని కోరుకున్నాడు. అప్పటినుంచి తల్లి లేని దానికి అన్నీ తానే అయ్యాడు. బంగారు రంగులో మెరిసి పోతూ, అది ఆశ్రమ ప్రాంగణంలో చెంగనాలు వేస్తూ ఉంటే చూసి మురిసిపోయాడు. దాని ధ్యాసలో పడి తన తపోదీక్షను కూడా పక్కన పెట్టాడు.

సర్వసంగ పరిత్యాగి అయిన ఆ రాజర్షికి అనుక్షణం దాని ఊహే! దానితో ఆటలే! కాసేపు ఆ లేడి ఎక్కడికైనా వెళ్తే, అది తిరిగి వచ్చేవరకు ఆయన ప్రాణం విలవిలలాడేది క్రూరమృగ మేదైనా దానిని పొట్టన పెట్టుకుందేమోనని. ఆటల్లో, అది యజ్ఞానికని తెచ్చుకున్న సమిధలను అపరిశుభ్రం చేస్తున్నా, దర్భగడ్డిని తొక్కిపాడుచేస్తున్నా, అదిలించేవాడు కాదు. అది కూడా భరతుడంటే ప్రాణాలు పెట్టేది. ఆయన తినిపిస్తే తప్ప పచ్చగడ్డి కూడా కొరికేది కాదు. ఓసారి ఆ లేడి ఎక్కడికో వెళ్లింది. నాలుగురోజులపాటు తిరిగి రాలేదు. ఎంత వెదికినా కనిపించలేదు. దానికి ఏమైనా అయిందేమోనని బెంగపెట్టుకుని, ఆయన జబ్బుపడ్డాడు. తనకు అంత్యసమయం వచ్చిందని గ్రహించాడు.

సరిగ్గా అదే సమయంలో ఆ లేడి వచ్చి, ఆయన కాళ్లు నాకుతూ ఉండిపోయింది. దానినే చూస్తూ, తన తర్వాత దాని బాగోగులు ఎవరు చూస్తారా అనే బెంగతో ఆయన ప్రాణాలు విడిచాడు. జీవుడు చనిపోయే సమయంలో దేని గురించి ఆలోచిస్తే, ఆత్మ తిరిగి ఆ రూపం తీసుకుంటుందంటారు. జన్మరాహిత్యం కోరిన భరతుడు చివరి దశలో ఆ లేడిపిల్లను చేరదీసి, దాని ధ్యాసలో పడి మరణించడం వల్ల ఆయన అంతవరకు చేసిన తపస్సంతా వ్యర్థమై, మరుజన్మలో ఆయన లేడిగా పుట్టవలసి వచ్చింది. ఆ తర్వాత ఆయన మరో జన్మ కూడా ఎత్తవలసి వచ్చింది. అందుకే అంత్యసమయంలో భగవన్నామ స్మరణ చేయాలంటారు.*ఓం శం శనేశ్ఛరాయనమః *

మనం కోరినప్పుడు పున్నమి రాదు ఇష్టపడినప్పుడు వసంతం రాదు చూడాలనుకున్నప్పుడు ఇంద్రధనుస్సు రాదు…..

అలాగే ఆశించినప్పుడు ఆత్మీయులు మనకు దొరకరు……

జీవితం ఆనందమయంఅయ్యేది కోరుకున్నవి పొందినప్పుడే కాదు……
పొందినవి ఆశ్వాదించినప్పుడు కూడా…….మనలోని స్వార్ధం,గర్వం మంచుబిందువులా కరిగిపోవాలే తప్ప…….

అగ్నిలా మనల్ని దహించివేయకూడదు……..

మనలోని మంచితనం,ప్రేమగుణం పువ్వులా ప్రతిరోజు వికాశించాలే కానీ……..

ఎడారిలా మనల్ని ఒంటరి చేయకూడదు……..
అంత్యసమయంలో భగవన్నామస్మరణ చెయ్యాలంటే నిరంతరం దైవనామస్మరణ మదిలో జరగాలి ఇదే మనకి శనేశ్వరడు తెలియచేస్తాడు!!!!!!!

About The Author