మన ఇంటికి వాస్తు అవసరం దోశం రాకుండా వుండాలంటే… ?


మన ఇంటికి వాస్తు అవసరం
దోశం రాకుండా వుండాలంటే… ?

*హృదయాన్ని (మెదడుని) తాకిన యాధార్ధంగా జరిగిన ఓ చక్కని కథ తప్పక మీ అందరితో పంచుకోవాలి అనిపిస్తోంది!* ✍ మీ రమణాకర్

విశాఖపట్నం కు చెందిన మునుస్వామి వ్యాపార వేత్త, వ్యాపారం లో బాగా సంపాదించి స్థిరపడిన పెద్దమనిషి.

సంపాదించిన ఆస్తి లో కొంత భాగం తో వారు విశాఖపట్నం శివారు పల్లెటూరు లో కొంత భూమి కొని, అక్కడ ఒక
3 అంతస్తుల ఫామ్ హౌస్ కట్టుకున్నారు. ఆ ఫామ్ హౌస్ దొడ్డి వైపు ఒక చక్కని స్విమ్మింగ్ పూల్, గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. వాటితో పాటు అక్కడ ఒక 100 ఏళ్ళ నాటి పెద్ద మామిడి చెట్టు కూడా ఉంది. నిజానికి ఆయన ఆ ఆస్తి కొన్నది కూడా ముఖ్యంగా ఆ పెద్ద మామిడి చెట్టును చూసి ముచ్చట పడే,ఎందుకంటే ఆయన భార్యకు మామిడి పళ్ళు అంటే చెప్పలేనంత ఇష్టం.

ఆ కొత్త ఇంటికి పనులు చేయిస్తున్న సమయం లో మునుస్వామి గారి శ్రేయోభి లాషులు కొందరు, వాస్తు చూపించుకుని ఇంటికి తగిన మార్పులు చేయించు కోమని వారికి గట్టిగా సలహా ఇచ్చారు.

అయితే వాస్తు పై పెద్దగా నమ్మకం లేని వ్యక్తి మునుస్వామి గారు. అయితే ఆశ్చర్యకరం గా వారి ఆత్మ ప్రభోదం మేరకు వారు ఒక వాస్తు పండితుడ్ని సలహా కొరకు ఆరా తీసి హైదరాబాద్ నుండీ ఒకగొప్పవాస్తు విద్వాన్ ని పిలిపించారు.
ఆ వాస్తు పండితులు వైజాగ్ వచ్చాక భోజనానంతరం మునుస్వామి గారి సొంత డ్రైవింగ్ లో ఇద్దరూ వైజాగ్ శివారు స్వామి గారి తోట కు బయలుదేరారు.
వారు వెళ్తున్న దారిలో మునుస్వామి గారు కారును కొద్దిగా పక్కకు తీసి, వెనుకగా వస్తున్న కొన్ని కార్లకు దారివ్వడం చూసిన వాస్తు పండితుడు చిరునవ్వు తో “స్వామి గారూ! మీ డ్రైవింగ్ నిజంగా చాలా సురక్షితమైనది” అన్నారు.

దానికి స్వామి గారు నవ్వుతూ”అయ్యా! వారికి ఏదో అత్యవసర పని అయి ఉండ వచ్చు, అందుకే తొందర లో వెళ్తున్నారు. అలాంటి వారికి ముందుకు వెళ్ళడానికి మనం దారి ఇవ్వడం మన ధర్మం కదండీ!” అన్నారు.

అక్కడ నుండి కారు చిన గంట్యాడ అనే చిన్న పల్లెటూరు సమీపించింది.అక్కడి వీధులు చిన్నగా ఇరుకు గా ఉండడం తో స్వామి గారు కారు వేగం తగ్గించి స్లోగా నడుపుతున్నారు.

ఇంతలో హఠాత్తుగా ఒక కొంటె కుర్రాడు రోడ్డుకు అడ్డంగా పరుగెత్తాడు. గమనించిన స్వామి గారు అతడ్ని తప్పించి తన కారును మరింత నెమ్మది గా పోనిస్తున్నారు.

అది ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. ఇంత లోనే మరో కుర్రాడు కూడా అలాగే హఠాత్తుగా పరిగెత్తుతూ ముందుకు వెళ్ళిపోయాడు.

ఈసారి ఆశ్చర్య పోవడం వాస్తు పండితుని వంతైంది. ఆయన “సార్! ఇలా ఇంకో పిల్లాడు మరలా వస్తాడని మీరెలా ఊహించారు?” అని ప్రశ్నించారు.

స్వామి గారు నవ్వుతూ “పిల్లలెప్పుడూ అంతే కదండి! ఒకరి వెంట మరొకరు వెంట పడుతూ ఆడుకుంటారు. వెనుక ఇంకొకడు లేకుండా ఒక్కడే ఎప్పుడూ అలా ఆడుకోరు కదా?” అన్నారు.

ఆ మాట విన్న వాస్తు పండితుడు ఆనందం గా బ్రొటన వేలు పైకెత్తి చూపిస్తూ మీరు దాన్ని ఊహించి నడపడం నిజానికి మీ గొప్ప దనం” అని స్వామి గారిని అభినందించారు.

కారు ఫామ్ హౌస్ కి చేరుకుంది. కారు లోంచి వారు క్రిందికి దిగుతుండగా, అక్కడ ఒక్కసారిగా 7,8 పక్షులు రెక్కలు కొట్టుకుంటూ పైకి ఎగిరాయి! అది చూసిన స్వామిగారు, పండితుడిని ఆపి, “సర్! మీరు ఏమీ అనుకోకపోతే, మనం కొద్ధి సేపు ఇక్కడే ఆగి వెళదాం!ఏమంటారు?”అన్నారు.

“ఏమండీ ఎందుకు?”అన్నారు వాస్తు పండితుడు.

స్వామి గారు నవ్వుతూ.. . “అక్కడ దొడ్డి వైపు ఎవరో కొంతమంది పిల్లలు చెట్టెక్కి మామిడి పళ్ళు కోస్తున్నట్లుంది.
మనం కనుక హఠాత్తు గా వెళ్తే వాళ్ళు మనల్ని చూసి భయపడి చెట్టు నుండి దూకితే క్రింద పడిపోతారు. ఎందుకండీ అనవసరం గా అంతలా వాళ్ళని భయపెట్టి సాధించేదేముంది” అన్నారు.

పండితుడు కొంతసేపు మ్రాన్పడి పోయారు. ఆపై నెమ్మదిగా ఇలా అన్నారు.
“ఈ ఇంటికి ఎటువంటి వాస్తు మార్పు-చేర్పులు అవసరం లేదు !”

ఈసారి ఆశ్చర్య పోవడం స్వామి గారి వంతైంది… “ఏం ఎందుకండి?”

“ఏ ప్రదేశం అయినా, మీ లాంటి ఉత్తములు నివసిస్తూ ఉంటే, సహజం గానే అది ఉత్తమ మైన వాస్తు గా దానంతట అదే మార్పు చెందుతుంది, సందేహం లేదు.” అన్నారు వాస్తు పండితుడు.

???

*ఎప్పుడైతే మన ఆలోచనలు, ఆకాంక్ష ఇతరుల యొక్క శ్రేయస్సు, సంక్షేమం కోరుకుంటాయో, ఆ ఫలితం లబ్ది పొందే వారికే కాక, అది మనకి కూడా మంచి చేస్తుంది.*

అయితే ప్రత్యేకించి ‘ఎల్లప్పుడూ అన్ని
సమయాల్లోనూ ఇతరుల సంక్షేమం కాంక్షించే వ్యక్తి వారికి తెలియకుండానే
మహోన్నతుడు,సత్పురుషుడు గా మారి పోతాడు.’

నిజానికి సాధువు, సత్పురుషుడు అంటే ఎల్లప్పుడూ సమాజానికి మేలు చేసే వ్యక్తులే కదా!

*ఇది ఓ గొప్ప వాస్తు విద్వాన్ అభిప్రాయం.

*మరి మీ అందరికీ కూడా ఇకపై మీ ఇంటికి వాస్తు పండితుని అవసరం రాకూడదని ఆశిస్తున్నా!

లోకాస్సమస్తా సుఖినోభవన్తు???????

About The Author