కొబ్బరినూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో…

* కొబ్బరినూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.
* రావిచెట్టు క్రింద ఉండే నాగ దేవతల విగ్రహాలకు పూజ చేసేటప్పుడు శ్రీ అశ్వథనారాయణస్వామి వారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే దాంపత్య జీవితం సుఖంగా, సంతోషంగా ఉంటుంది.

* కుజదోషం ఉన్నవారు మంగళవారం కానీ, శుక్రవారం నాడు కానీ, కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి పూజచేసి పప్పుతో బొబ్బట్లు చేసి నైవేద్యం పెట్టి వాయనంగా 11 మంది ముత్తైదువులకు దానం ఇస్తే వారికి కుజదోషం తొలగిపోయి సత్వరమే వివాహం అవుతుంది.

* మహాలక్ష్మీదేవికి కొబ్బరినూనెతో 40 రోజులు ఆరాధిస్తే వారికి రావలసిన అప్పులు వసూలు అవుతాయి.

* ఎవరైతే ప్రతిరోజూ మహాలక్ష్మికి కొబ్బరినూనెతో దీపారాధన చేసి కొబ్బరి, పంచదారని నైవేద్యంగా పెట్టి పూజిస్తారో వారింట్లో శుభకార్యాలు జరుగుతాయి.

* పితృదేవతలకు శ్రాద్ధాలు పెట్టే సమయంలో కొబ్బరినూనెతో దీపారాధన చేస్తే వారివారి పితృదేవతలకు స్వర్గ లోకాలు ప్రాప్తిస్తాయి.

* ఎవరైతే ప్రతి శనివారం నాడు శ్రీ వేంకటేశ్వరస్వామివారికి కొబ్బరినూనెతో దీపారాధన చేసి తులసి దళాలతో మాలకట్టి ప్రార్థించి హారంగా వేస్తారో వారికి జీవితాంతం ఆర్థిక సమస్యలు రావు.

* హరిద్వార్లో సాయంసంధ్యలో గంగాదీపాన్ని కొబ్బరినూనెతో వెలిగించి నదిలో వదిలితే వారికి, కుటుంబ సభ్యులకు జీవితాంతం ప్రతి ఏటా గంగాస్నానం చేసిన ఫలితం కలుగుతుంది.
* ఎవరైతే కాశీలో విశ్వేశ్వరస్వామివారికి సోమవారం రాత్రి హారతి ఇచ్చేటప్పుడు కొబ్బరినూనెతో దీపారాధన చేస్తారో వారికి… వారు కోరుకున్న కార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి.

About The Author