మూడు స్థంబాలాట…

— జనసేన, తేదేపా,కాంగ్రెస్ లది అంతర్గత ఒప్పందమేనంటున్న విశ్లేషకులు…

— తొందర పాటు వ్యాఖ్యలతో … ప్రత్యర్ధి వ్యూహరచనకు తానే అవకాశం ఇచ్చిన వైసీపీ…

నాలుగు రోజుల క్రితం, మంత్రి గంటా ఆధ్వర్యంలో… సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు అన్న వార్త బయటకు రాగానే… మీడియా హడావుడి సహజమే అయినప్పటికీ… వ్యూహాత్మకంగా వైసీపీ ఓ మైండ్ గేమ్ కు తెర తీసింది…

పార్టీ కీలక నేత అంబటి, లక్ష్మీనారాయణ, చంద్రబాబులే లక్ష్యంగా చేసిన సంచలన వ్యాఖ్యలు చూస్తే… గతంలో జగన్మోహన్ రెడ్డి సీబీఐ కేసుల విషయంలో… చంద్రబాబు, లక్ష్మీనారాయణ కుమ్మక్కై కుట్రపూరితంగా అక్రమ కేసుల లో ఇరికించారని, లక్ష్మీనారాయణ నిజస్వరూపం ఇప్పుడు బట్టబయలైందని పేర్కొన్నారు అంబటి.

సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా… ఘటన జరుగక ముందు, మీడియా కథనాలపై స్పందించడానికి అంతగా ఇష్టపడవు… కానీ మరికొన్ని గంటలలో లక్ష్మీనారాయణ మంత్రి గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో, చంద్రబాబు సమక్షంలో తేదేపా లో చేరుతున్నారనే స్పష్ఠమైన సమాచారం తో… అత్యంత వేగంగా స్పందించిన వైసీపీ… వ్యూహానికి తెలుగుదేశం అధినాయకత్వం నెవ్వరపోయిందనే చెప్పవచ్చు…. చివరి నిమిషంలో లక్ష్మీనారాయణ చేరికను విరమించుకోవడమే కాక… స్వయంగా చంద్రబాబే అవన్నీ ఊహాగానాలేనని ప్రకటించారు.

సరిగ్గా ఇక్కడే బాబు తన నలభైఏళ్ళ సుదీర్ఘ అనుభవంతో సరికొత్త వ్యూహానికి తెరలేపారు…
పార్టీలకు అతీతంగా ఉంటున్న తటస్థులు, ముఖ్యంగా యువత, వైసీపీ వైపు ఆకర్షితమౌతోంది అనే సర్వేల నేపథ్యంలో… గతంలో పవన్ తో కలవడానికి ఇష్టపడని, లక్ష్మీనారాయణ ను జనసేన గూటికి చేర్చడం… బాబుగారి రాజకీయ వ్యూహంలో భాగమేనని నిర్ద్వందంగా చెప్పవచ్చు…

— స్రవంతీ చంద్ర

About The Author