గొల్ల కుర్మలకు అండగా ఉంటాం…ఎమ్మెల్యే హరీష్ రావు…

– గొల్ల కుర్మలకు అండగా ఉంటాం.
– ప్రతీ పల్లెలో గొర్రెల షెడ్ల నిర్మాణాలు.
– ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి.
– గొల్ల కుర్మలతో సమావేశం.

సీఎం కేసీఆర్ గారు గొర్రెల పంపిణీ చేపట్టి గొల్ల కుర్మల కుటుంబాల్లో వెలుగులు నింపారు అని…
సిద్దిపేట నియోజకవర్గ గొల్ల కూర్మలకు అండగా ఉంటామని.. ప్రతి గ్రామంలో గొర్రెల షెడ్ల నిర్మాణాలు చేపట్టాలి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు… సిద్దిపేట తన నివాసం లో పలు గ్రామాల కు చెందిన గొల్ల కూర్మలతో సమావేశం అయ్యారు.. ఈ సందర్భంగా
మాట్లాడుతూ..సిద్దిపేట నియోజకవర్గం అంటే అభివృద్ధి లో ఆదర్శం అని.. పలు ఆదర్శ గ్రామాలు అలా నిలిచాయన్నారు… అదే మాదిరిగా నియోజకవర్గంలో అన్ని గ్రామాలు అభివృద్ధి కార్యక్రమాల్లో నిలవాలి అని ఈ సందర్భంగా సూచించారు.. సీఎం కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా గోల్ల కుర్మల జీవనోపాధి పెంచేందుకు , ఆర్థికంగా చేయూత నిచ్చేనెదుకు గొర్రెల పంపిణీ చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు… గోల్ల కుర్మలకు అండగా ఉంటమన్నారు.. ఆదిశగా ప్రతి గ్రామంలో గొర్రెల పంపిణీ చేపట్టామని.. గొర్రెల కు మంచి వసతి ఉండే విధంగా.. గ్రామం.మన ఇళ్లు పరిశుభ్రంగా ఉండాలి అంటే సామూహిక గొర్రెల షెడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు.. మన నియోజకవర్గంలో ఇప్పటికె ఇబ్రహీంపూర్ , నర్మెట , ఇరుకోడ్ , గంగాపూర్ గ్రామాల్లో సామూహిక గొర్రెల షెడ్లు నిర్మించమన్నారు..ఆ మాదిరిగా అన్ని గ్రామాల్లో గొర్రెల షెడ్లు నిర్మించాలి అని అన్నారు.. పుల్లూరు , ఎన్ సాన్ పల్లి , బుస్సాపూర్ గ్రామాల్లో గొర్రెల షెడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు గొల్ల కూర్మలు ముందుకు రావడవం అభినందనీయం అని..ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో స్థలాలు ఉన్నాయని సర్పంచ్ లు ఎమ్మెల్యే దృష్టి కి తెచ్చారు.. రేపు ఆయా గ్రామాల్లో సర్పంచ్ , గొల్ల కుర్మల సహకారం తో గ్రామంలో వారు సూచించిన స్థలాలను పరిశీలించాలని సిద్దిపేట అర్భన్, రూరల్ ఏమ్మార్వో లను ఆదేశించారు.. స్థల సేకరణ వెంటనే పైనల్ చేసి గొల్ల కుర్మలకు అప్పగించాలని.. అదేవిధంగా వెంటనే పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకొవాలని ఈజిస్ అధికారులు, టెక్నీకల్ అసిస్టెంట్స్ లను సూచించారు. ఇందుకు ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు…

– గొర్రెలను కాపాడుకొనే బాధ్యత గొల్ల కుర్మలదే…

గొర్రెల ఇచ్చి గొల్ల కుర్మల కుటుంబాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారన్నారు.. మీకు గొర్రెలు ఇచ్చాము… షెడ్లు నిర్మిస్తున్నాము.. వాటిని కాపాడుకునే బాధ్యత మీదే నని.. గొర్రెలను ఎవరు అమ్మోకోవద్దు అని ఈ సందర్భంగా సూచించారు.. నియోజకవర్గంలో గొర్రెల యూనిట్ల పై వెటర్నరీ ఎడి తో వివరాలు అడిగి తెలుసుకున్నారు..ప్రతి గ్రామంలో వెటర్నరీ డాక్టర్ లు అందుబాటులో ఉండాలన్నారు .

About The Author