బిగ్ బ్రేకింగ్ న్యూస్… వైఎస్ వివేకా రెండో వివాహం …

 

వైఎస్ వివేకా హత్య కేసులో… ఇప్పటి వరకూ తెలియని సంచలనాత్మక విషయాలు బయటకు వస్తున్నాయి. అందులో ఒకటి వైఎస్ వివేకా రెండో వివాహం చేసుకోవడం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఏడాది అంటే 2010లో వైఎస్ వివేకానందరెడ్డి… రెండో పెళ్లిచేసుకున్నారు. ఆమె ముస్లిం యువతి. ఈ విషయం అత్యంత సన్నిహితులకు, కుటుంబీకులకు తప్ప ఎవరికీ తెలియదు. ఆమె కో కుమారుడు కూడా ఉన్నారు. ఆ పిల్లవాడికి నాలుగేళ్లు. వివేకానందరెడ్డి రెండో భార్య ప్రస్తుతం కడపలో నివసిస్తున్నారు. ఇంత వరకూ వైఎస్ వివేకానందరెడ్డికి.. ఒక్క కుమార్తె మాత్రమే ఉందని బయట ప్రపంచానికి తెలుసు. కానీ… వివేకానందరెడ్డి హత్య తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది.
వివేకానందరెడ్డి రెండో భార్య పేరు షేక్ షమీమ్. వయసు 34 సంవత్సరాలు. ఆమె స్వగ్రామం బలపనూరు మండలం సింహాద్రిపురం. చెన్నై ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ వరకు చదివారు. ప్రస్తుతం నాలుగేళ్ల కుమారుడితో కలిసి.. కడపలోని ప్రకాష్ నగర్‌లో నివసిస్తోంది. వైఎస్ వివేకాకు.. షమీమాకు ఎక్కడ పరిచయం అయిందో తెలియడం లేదు కానీ.. వయసులో ఇద్దరికీ చాలా గ్యాప్ ఉంది. వైఎస్ వివేకాకు.. ప్రస్తుతం 68 ఏళ్లు కాగా.. షమీమాకు 34 ఏళ్లు. వివేకానందరెడ్డి రెండో భార్య అంశం బయటకు రావడంతో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. వివేకానందరెడ్డి రెండో పెళ్లి, సోదరులతో ఏర్పడిన కుటుంబ గొడవలు, ఆస్తి వివాదాల కారణంగా… ప్రస్తుత ఘటనలు జరుగుతున్నాయా.. అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటి వరకూ రెండో భార్య కారణంగా… కుటుంబంలో ఎలాంటి వివాదాలు ఏర్పడినట్లుగా బయటకు రాలేదు. వివేకానందరెడ్డి మొదటి భార్య కానీ.. కుమార్తె కానీ.. పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు.

అయితే షమీమా పేరు మీద ఉన్న ఫోన్ నుంచే.. వైఎ్స వివేకానందరెడ్డికి చివరి సారిగా మెసెజులు వచ్చాయని… పోలీసుల విచారణలో తేలింది. ఒక్క మెసెజ్‌ను మాత్రమే కనిపెట్టారు. మిగతా మూడు మెసెజులను డిలీట్ చేశారు. ఆ మెసెజుల్లో ఏముంది..? వాటిని ఎవరు పంపారు..? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య.. పూర్తిగా తెలిసిన వాళ్ల పనేనని.. ప్రాధమికంగా పోలీసులకు దొరికిన సాక్ష్యాలను బట్టి అంచనా వేస్తున్నారు. సాక్ష్యాలను తుడిపేసే ప్రయత్నం చేయడం… ముందుగానే లెటర్ రాయించడం వంటి అంశాలను బట్టి ప్లాన్డ్‌గానే వహరిస్తున్నారంటున్నారు. ఇప్పుడు రెండో పెళ్లి అంశం… బయటకు రావడంతో… కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. పోలీసులు వివేకానందరెడ్డి రెండో భార్యను కూడా పిలిపించి ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం.

వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ బృందం దర్యాప్తు వేగవంతం చేసింది. జగన్ బంధువులు వైయస్ మనోహర్ రెడ్డి, వైయస్ భాస్కర్ రెడ్డి.. వైయస్ ప్రతాప్ రెడ్డిని పులివెందుల డిఎస్పీ కార్యాలయంలో సిట్ అధికారులు ప్రశ్నించారు. జగన్ ప్రధాన అనుచరుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి అలియాస్ దొండ్లవాగు శంకర్ ను సిట్ అధికారులు ప్రశ్నించారు.

About The Author