మూలపురుషా… ఏమిటీ దుస్థితి..?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, యాదగిరి గుట్ట పై వెలసిన లక్ష్మీ నరసింహుని, దివ్యక్షేత్ర అభివృద్ధి కై రాష్ట్ర ప్రభుత్వం, అకుంఠిత దీక్షతో… ఆగమశాస్త్రయుక్తంగా…
యాదగిరి గుట్టను… యాదాద్రిగా, భక్తులు తప్పక దర్శించాల్సిన పుణ్యక్షేత్రం గా రూపొందించింది…

అయితే… ఉదాసీనతకు,నిర్లక్ష్యానికి మారుపేరైన మన దేవాదాయశాఖ అధికారులు… ఈ క్షేత్రానికే మూల పురుషుడైన యాద‌ఋషి విగ్రహాన్ని, నిస్సిగ్గుగా చెత్తకుప్పల మధ్యన గాలికి వదిలేయడాన్ని… జీర్ణించుకోలేకపోతున్నారు సగటు భక్తులు..‌. వేల కోట్ల రూపాయల తో అధ్భుత శిల్పకళాకృతులతో… వందలమంది స్థపతులు… నిరంతరం శ్రమించి తీర్చిదిద్దిన ఈ పుణ్యస్థలిలో… మూల పురుషునికి ఓ మూల అయినా ఇంత చోటు కల్పించకపోవడం… నిజంగా బాధాకరం, ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరుస్తారో లేదో చూడాలి.

About The Author