వైఎస్ వివేకా హత్యకు బెంగళూరు భూ వివాదమే కారణమా…?


వైఎస్ వివేకా హత్యకు బెంగళూరు భూ వివాదమే కారణమా…?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక 125 కోట్ల రుపాయల సెటిల్మెంట్ వ్యవహారంలో వచ్చిన వివాదమే కారణమని సిట్ అధికారులు భావిస్తున్నారు. హత్య కేసు దర్యాప్తును మొత్తం 12టీములతో పర్యవేక్షిస్తున్న అధికారులు, ఈ మొత్తం వ్యవహారమంతా ఎర్ర గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డిల చుట్టూనే ఉందని… వారు నోరువిప్పితే మొత్తం బయటకు వస్తుందని అంటున్నారు. హత్యకు రెండు వారాల ముందే రెక్కీ జరిగిందని, బెంగళూరులోని ఓ భూ వివాదంలో వివేకా, గంగిరెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయని ఇప్పటి వరకు దర్యాప్తులో లభించిన ఆధారాలను బట్టి సిట్ గర్తించింది..?, ఈ డీల్ కు సంబంధించి ₹1.5 కోట్ల లావాదేవీలపై సిట్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. డీల్ లో తాము నష్టపోకూడదన్న ఉద్దేశంతో గంగిరెడ్డి, వైఎస్ వివేకాకు అత్యంత సన్నిహితుడైన పరమేశ్వర్ రెడ్డి తో చేతులు కలిపారని, హత్యకు నాలుగు రోజుల ముందు వివేకా పెంపుడు కుక్కను హత్య చేశారని అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు.

ఇప్పటికే గంగిరెడ్డిని అదుపులోకి తీసుకున్న సిట్ బృందం.. గత నాలుగు రోజులుగా రహస్య ప్రాంతంలో విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నిన్న రాత్రి తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరమేశ్వర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి తమ వెంట తీసుకువెళ్ళారు సిట్ అధికారులు. నేడు అతన్ని ప్రశ్నించనున్నారు.

About The Author