ఇదీ జనసేన బలం…
ఇది మేము చెబుతున్నది కాదు…,
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం పేరుమీద… జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గాలను ప్రకటిస్తూ… చేసిన వ్యాఖ్యలు..
జనసేనాని పవన్‌కళ్యాణ్ పోటీ చేయడానికి అనుకూలంగా ఏ నియోజకవర్గాలు ఉన్నాయి అని సర్వే చెయిస్తే… ఓ ఎనిమిది నియోజకవర్గాలు అనుకూలమని తేలాయి… అందులో మళ్ళీ మేధావులంతా కూర్చొని వడబోస్తే… భీమవరం, గాజువాక గా నిర్ణయించారు.
అంటే… 175 నియోజకవర్గాల్లో 29 నియోజకవర్గాలు SC లకు, 7 నియోజక వర్గాలు ST లకు రిజర్వు చేసారు… అనగా మొత్తం రిజర్వ్ చెసినవి 36, ఇక మిగిలిన జనరల్ కెటగిరీ లోని 139 నియోజక వర్గాల్లో మన జనసేనానికి అనుకూలమైనవి, కేవలం ఎనిమిది, అందులోను సర్వే పలితాలు, ఖచ్చితంగా గెలుస్తాయి అని వచ్చినవి, రెండు…
ఈ ఎనిమిది నియోజకవర్గాల లోను, ఆరు ఉత్తరాంధ్ర మరియు ఉభయ గోదావరి జిల్లాలవే… రెండు రాయలసీమ.. అనగా *ఇదీ జనసేన బలం* అని పార్టీ చెప్పకనే చెప్పింది. అంతేగా… అంతేగా…