సులభతర వాణిజ్యం పై… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష…
సులభతర వాణిజ్యం 2019 కి సంబంధించి 80 సంస్కరణలకు గాను 78 పూర్తి అయ్యాయని, మిగతా 2 సంస్కరణలను మార్చి 27 లోగా పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషి ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో EODB Reforms Action Plan 2019 పై సి.యస్ డా. ఎస్.జోషి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ముఖ్యకార్యదర్శులు జయేష్ రంజన్, సునీల్ శర్మ, శశాంక్ గోయల్, పరిశ్రమల శాఖ కమీషనర్ నదీమ్ అహ్మద్, పిసిబి సెక్రటరీ సత్యనారాయణరెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్ రావు, ఫైర్ సర్వీసెస్ డిజి గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ పరిశ్రమల శాఖ అధికారులు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలన్నారు. సంస్కరణల Feed back Methodology, Implementation guidelines అన్ని శాఖలు పాటించేలా చూడాలన్నారు. DIPP నిబంధనల ప్రకారం సంస్కరణలు ఉండాలన్నారు.
పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ Construction permission online approval కు సంబంధించి అటవీ, ఫైర్ శాఖల డాటాను మున్సిపల్ శాఖతో అనుసంధానం పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. కార్మిక శాఖకు సంబంధించి ESI Corporation Data ను Share చేసే విషయమై DIPP తో సంప్రదించనున్నట్లు తెలిపారు. మంచినీటి కనెక్షన్లకు సంబంధించి మిషన్ భగీరథ, మెట్రోవాటర్ వర్క్స్ అధికారులు అవసరమైన చర్యలను పూర్తి చేశారని సి.యస్ కు వివరించారు.