గత అనుభవాలతోనైనా మేలుకోండి… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…
రాష్ట్రంలో ఎగ్జిబిషన్లు, పబ్లిక్ మీటింగులు, వేడుకలు, ఉత్సవాల నిర్వహణకు అగ్నిమాపక, మున్సిపల్, పోలీస్, విద్యుత్ తదితర శాఖలు అనుమతి మంజూరు చేయడానికి అవసరమైన ముసాయిదా నిబంధనలను వారంలోగా తయారు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషి ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె జోషి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, హోం శాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది, జిహెచ్ఎంసి కమీషనర్ దానకిషోర్, పోలీస్ కమీషనర్లు అంజనీకుమార్, మహేష్ భగవత్, ఫైర్ సర్వీస్ డిజి గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అగ్నిప్రమాదం సంభవించిన నేపధ్యంలో రాష్ట్రంలో ఎగ్జిబిషన్లు, వేడుకలు, సమావేశాల అనుమతులకు సంబంధించి Standard Operating Procedures ను రూపొందించాలని సి.యస్ కోరారు. వివిధ శాఖలు అనుమతికి దరఖాస్తు చేయడానికి Single Application Form ను రూపొందించాలన్నారు. చేప ప్రసాదం పంపిణి, నుమాయిష్ తదితర Events ప్రతి సంవత్సరం నిర్వహిస్తారని వీటికి సంబంధించి Model Layout ను రూపొందించాలన్నారు. ఎగ్జిబిషన్లకు వచ్చే సందర్శకులు, ఏర్పాటు చేయవలసిన స్టాళ్ల పై ప్రత్యేక అవగాహన ఉండాలన్నారు.
Permanent Buildings, Temporary Buildings, High rise Buildings, పంక్షన్ హాళ్లు తదితర క్యాటగిరిలుగా విభజించి, నిబంధనలు రూపొందించాలన్నారు. నిర్వాహకులు ఆన్ లైన్ లో ముందుగానే ధరఖాస్తులు సమర్పించేలా నిబంధనలు ఉండాలన్నారు. వివిధ వేడుకలు, ఎగ్జిబిషన్లు, సమావేశాలు జరిగేటప్పుడు విద్యుత్, అగ్నిమాపక, మున్సిపల్ తదితరశాఖల అనుమతుల మంజూరుకు క్షేత్రస్ధాయిలో తనిఖీలు ఉండాలన్నారు. అత్యవసర Exits, Fire Engine లు సులభంగా వెళ్లేలా రహదారులు, సైనేజ్, పార్కింగ్, నీటిసదుపాయం, ఇన్సూరెన్స్, Fire hydrants ఏర్పాటు తదితర అన్ని అంశాలతో లేఅవుట్ ఉండేలా చూడాలన్నారు. ప్రజల భద్రత, రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. Short Circuits ను కూడా ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. నిర్ణీత కాలవ్యవధిలో అనుమతులు ఇచ్చేలా నిబంధనలు ఉండాలన్నారు. పోలీసు కమీషనర్లు, జిల్లా కలెక్టర్లు తగు అనుమతులు మంజూరు చేసేలా నిబంధనలు ఉండాలన్నారు.
మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ మాట్లాడుతూ భవనాల నిర్మాణ అనుమతులను మంజూరీ లో Lift ల ఏర్పాటు, నిర్వహణకు సంబంధించి నిబంధనలు రూపొందిస్తామన్నారు. క్షేత్రస్ధాయిలో భవనాలను Random Inspections చేస్తామని తెలిపారు. నిబంధనలు రూపొందించాక వేడుకల నిర్వాహకులతో సమావేశాలు నిర్విహంచి అవగాహన కల్పిస్తామన్నారు. అన్నినిబంధనలు పాటించేలా చూస్తామన్నారు. ముసాయిద నిబంధనల రూపకల్పనలో చట్ట పరంగా ఉన్న అంశాలను దృష్టిలో ఉంచుకుంటామన్నారు. అన్ని అంశాలు Cover అయ్యేలా చూస్తామన్నారు. ప్రజల సౌకర్యం, భద్రత ముఖ్యమన్నారు.