నీరవ్ మోదీ అరెస్ట్…
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.13 వేల కోట్లు ఎగ్గొట్టిన కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీని లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు అతణ్ణి వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరు పరుచనున్నారు. కోర్టు ఇప్పుడు నీరవ్ మోదీని ఇండియాకు అప్పగింత కేసును విచారిస్తుంది.భారత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నీరవ్ మోదీ అప్పగింతను కోరుతూ వెస్ట్ మినిస్టర్ కోర్ట్‌ను కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు నీరవ్‌పై అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ఇటీవల లండన్ వీధుల్లో తిరుగుతూ నీరవ్ మోదీ కెమెరా కంటపడ్డాడు. ఆ తర్వాత వెస్ట్‌మిన్‌స్టర్ కోర్టు అతనికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
నీరవ్ మోదీ గతేడాది పీఎన్‌బీ స్కాం బయటపడక ముందే దేశం విడిచి పారిపోయాడు. ఈ స్కాంలో మారో నిందితుడు, నీరవ్ మేనమామ మెహుల్ చోక్సీ కూడా దేశం వదిలి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతడు కరీబియన్ దేశమైన ఆంటిగ్వాలో ఉంటున్నాడు. అంతకుముందే ఆ దేశ పౌరసత్వం తీసుకున్న చోక్సీ.. ఈ మధ్యే భారత పాస్‌పోర్ట్‌ను కూడా వదులుకున్నాడు.