అద్భుతమైన డిజైన్లతో యాదాద్రి టేకు మహాద్వారాలు

అద్భుతమైన డిజైన్లతో యాదాద్రి టేకు మహాద్వారాలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయ నిర్మాణ పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి. ఆలయ రాజగోపురాలు, ప్రాకారం పనులు పూర్తికావడంతో ఇక ఏడు రాజగోపురాలకు, మహాద్వారానికి దర్వాజలు తయారు చేయించి అమర్చే పనులను ఆలయాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఏడు గోపురాలకు వాటి సైజుల ఆధారంగా టేకు మహాద్వారాలను తయారు చేసే పనులు పూర్తి కాగా, తుది మెరుగులు దిద్దుతున్నారు. నాలుగు పం చతల గోపురాలకు 17.5/9.5 అడుగుల పొడ వు, వెడల్పుతో తయారయ్యాయి. కొండపై ఎత్తయిన సప్తతల రాజగోపురానికి గాను 24.5/11.5 అడుగుల పొడవు, వెడల్పుతో దర్వాజలను అత్యంత సుందరంగా తయారు చేయించారు. కొండపైన గల ఏడు గోపురాలు, ప్రధానాలయం, శివాలయం, శ్రీసత్యనారాయణస్వామి వ్రతమండపం ఇతర ముఖ్య నిర్మాణాలకు భారీ దర్వాజలను చేయించారు. గర్భాలయ మహాద్వారాన్ని కూడా టేకుతో చేయించారు. ఆ తరువాత దానికి వెండి లేదా బంగారు తొడుగును భక్తుల విరాళంతో చేయించేందుకు నిర్ణయించారు.

About The Author