“మీడియా ప్రొటెక్షన్ బిల్” కి ఆమోదం!!

*మీడియాపై దాడి చేస్తే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్!*

*నేరం రుజువైతే మూడేండ్ల జైలు శిక్ష..*

తరచుగా మీడియా సంబంధిత వ్యక్తులు, సంస్థలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాటి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని మీడియా సంఘాలు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూన్న విషయం తెలిసిందే. ఇక వారి సమస్యలు తీరనున్నట్లు కనపడుతోంది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలో పాత్రికేయులు, మీడియా సంస్థల భద్రత కోసం “మీడియా ప్రొటెక్షన్ బిల్” ను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించింది.

ఈ చట్టం ప్రకారం మహారాష్ట్రలో పాత్రికేయుల మీద దాడి చేసినా, సదరు మీడియా సంస్థలపై దాడి చేసి ఆ సంస్థ ఆస్తులకు నష్టం చేకూర్చినా రూ.50,000ల జరిమానా విధిస్తారు. వీటితో పాటుగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు. విచారణలో నేరం రుజువైతే 3 సంవత్సరాల కారాగార శిక్ష కూడా పడుతుంది. అలాగే దాడి చేసిన వ్యక్తుల నుంచి నష్ట పరిహారం, బాధిత పాత్రికేయునికి వైద్య ఖర్చులూ తిరిగి వసూలు చేయబడతాయి.

ఈ “మీడియా ప్రొటెక్షన్ బిల్” బిల్లులో విలేకరులు, ప్రతినిధులు, సంపాదకులు, ఉప సంపాదకులు, వార్త సంపాదకులు, ఫీచర్ రైటర్స్, ప్రూఫ్ రీడర్స్, కాపీ రైటర్స్, కార్టూనిస్

About The Author