తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థుల సంచలన నిర్ణయం…

కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ…

మానవ హక్కుల కమీషన్ కు విజ్ఙప్తి…

మీడియా సోదరులకు విజ్ఞప్తి..!

తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులమైన మేము ఈ రోజు అనగా..22/03/2019 న కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తున్నాం.
గత రెండున్నరేళ్లుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ ప్రభుత్వ అలసత్వం మూలాన గ్రూప్ -2 మెరిట్ జాబితాలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఫలితాలు వెలువడక మానసిక క్షోభకు గురి అవుతున్నాం… పరీక్ష నిర్వహణ దశ నుంచీ టీఎస్‌పీఎస్సీ చేస్తోన్న తప్పిదాల వల్ల మెరిట్ లిస్టులో ఉన్న మేం బాధితులుగా మారాం.

రెండున్నరేళ్ల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతూ మా విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నాం. ప్రభుత్వానికి విన్నవించినా, టీఎస్సీపీఎస్సీ అధికారులను కలిసినా వారిలో కనీస స్పందన కూడా లేదు. ప్రభుత్వంలో కదలిక తేవాలని ఎన్నో సార్లు ఆందోళనలు, ధర్నాలు చేసినప్పటికీ వాళ్ల నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. అలాగే, ఈ ఉద్యోగం రాక, వేరే ఉద్యోగం చేయలేక ఇంటా బయట ఎన్నో అవమానాలు ఎదర్కొంటున్నాం. తీవ్ర మానసిక వ్యథ అనుభవిస్తున్నాం.

చివరకు ఏ దారి లేక 200 మంది అభ్యర్థులం ఇప్పుడు కారుణ్య మరణం కోసం మానవహక్కుల కమిషన్‌ను కలుస్తున్నాం. మా వేదనను మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాం.

ఇట్లు

తెలంగాణ గ్రూప్-2 బాధితులు

Contact Numbers:

Geetha–8328018263

Sujatha–8886441168

Shravya-9440880098

Rajitha-7997116497

Imran-9676885709

Sanath-9908940271

Gopal-9989490013

Pramodh-9490288882

About The Author