ఓ గర్భిణిని చూసి పోలీసు అధికారి చలించిపోయాడు…

పురిటి నొప్పులతో ప్రసవ వేదన పడుతున్న ఓ గర్భిణిని చూసి పోలీసు అధికారి చలించిపోయాడు.

సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆ నిండు గర్భిణిని.. మానవతా హృదయంతో.. ఆస్పత్రి దాకా తన చేతులతో పోలీసు అధికారి మోసుకెళ్లాడు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మథురలో నిన్న చోటు చేసుకుంది.

ఈ సందర్భంగా పోలీసు అధికారి మాట్లాడుతూ.. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను చూశాను.

సహాయం చేయాలని అక్కడున్న ప్రజలను ఆమె భర్త వేడుకుంటున్నాడు.

ఆ సమయంలోనే తాను అంబులెన్స్‌కు ఫోన్ చేశాను.

కానీ అంబులెన్స్ అందుబాటులో లేదు. ఇక చేసేదిమి లేక ఆ నిండు గర్భిణిని తన చేతులపై ఆస్పత్రి దాకా మోసుకెళ్లాను.

పండంటి బిడ్డకు ఆ మహిళ జన్మనిచ్చిందని, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని పోలీసు అధికారి తెలిపారు.

About The Author