కర్నూల్ జిల్లా, వెలుగోడు పట్టణంలో ఎలుగుబంటి హల్చల్…

https://www.facebook.com/Kurnoolcityofficial/videos/392770768245012/?t=96


కర్నూల్ జిల్లా, వెలుగోడు పట్టణం తెలుగుగంగ
రిజర్వాయర్ లో ఎలుగుబంటి హల్చల్.
గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు.

ఎలుగుబంటి ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.

అదుపులోకి తీసుకునే ప్రయత్నం లో ప్రొడక్షన్ వాచర్ కుమార్ పై ఒక్కసారిగా దాడిచేసిన ఎలుగుబంటి.

కుమార్ మెడను పట్టుకొని కొంతదూరం నీళ్ళలోకి లాకెళ్లిన ఎలుగుబంటి.

అక్కడికి చేరుకున్న గ్రామస్తులు, మరియు ఫారెస్ట్ ఆఫీసర్లు గట్టిగా అరుపులు కేకలు వేయడంతో కుమార్ ను వదిలేసిన ఎలుగుబంటి వెలుగోడు గ్రామ పొల్లాలోకి పరుగులు తీసింది.

తీవ్రంగా గాయపడిన ప్రొడక్షన్ వాచర్ ను వెలుగోడు ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. అక్కడి డాక్టర్ లు ప్రధమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు.

ఎలుగుబంటి తపించుకొని వూరి పొలిమేరలోకి వెళ్లడంతో ఏక్షణాన ఊరిమీద దాడి చేస్తుందోనని అక్కడి ప్రజలు భయందోళనకు గురిఅవుతున్నారు.

About The Author