కోణార్క్ సూర్య దేవాలయం – Konark Sun Temple…
కోణార్క్ సూర్య దేవాలయం – Konark Sun Temple :
కొన్ని వాస్తవాలు తెలుసుకోకపోవడమే మంచిదేమో… ఒక్కో ఆలయ చరిత్ర, వాటి గొప్పతనం తెలుసుకుంటుంటే అవి ఇప్పటి తరంలో లేనందుకు ఎంతో బాధేస్తుంది. మనదేశ గొప్పతనం ముందుతరాల ( ప్రస్తుతం ) వారికి తెలియకుండా చాలా వరకు ఇతర దేశస్తులు మనదేశం పై దాడి చేసి మన ఆలయాలను, విగ్రహాలను ధ్వంసం చేసారు. ఇప్పటికైనా వాటిని కాపాడి , వాటి గురించి పరిశోధనలు చేసి ప్రస్తుత, ముందు తరాల వారికీ తెలియచేయాల్సిన భాద్యత మన ప్రభుత్వాలు తీసుకుంటాయని ఆశిస్తున్నాము.
ఆ విధంగా ధ్వంసం చేయబడిన వాటిల్లో ఒక అద్భుత ఆలయం “కోణార్క్ సూర్య దేవాలయం”. ఇక్కడ ఆలయంలో ని సూర్యభగవానుని విగ్రహం ఎటువంటి ఆధారం లేకుండా గాలిలో ఉండేది.
పోర్చుగీస్ నౌకలు ఇక్కడి సముద్రతీరం దగ్గరకు వచ్చే సరికి నౌకల లోని దిక్సూచి ముళ్ళు ఎటు తిరగక స్థిరంగా నిలబడి నౌకలు ముందుకు వెళ్లకుండా అలాగే నిలబడి ఆశ్చర్యాన్ని కలిగించిందట. దానితో వారు ఆ ప్రాంతమంతా శోధించి ఇక్కడి ఆలయంలోని సూర్యభగవానుడి విగ్రహం ఎటువంటి ఆధారం లేకుండా గాలిలో నిలబడడం చూసి ఆశ్చర్యపడి అయస్కాంత కేంద్రక ఆకర్షణ కారణంగా ఇలా జరుగుతుంది అనే విషయాన్ని కనుగొని ఆలయంలోని ఒక గోడను పడగొట్టడం తో నౌకలు కదిలాయట . ఇదే అదనుగా ఆలయాన్ని సమూలంగా పడతోసి విద్వంసానికి పాల్బడ్డారు. అప్పటిదాకా ఏంతో వైభవంతో అలరారిన ఆలయం ఈ విద్వంసం తో కాలగర్భంలో కలిసిపోయే దుస్థితి కి చేరింది. ఇప్పటికి ఈ అద్భుత ఆలయం పై పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి.
అద్భుతమైన ఈ కోణార్క్ సూర్య దేవాలయం (Konark Sun Temple )