అమ్మ నాన్న నన్ను గుర్తిస్తే నా కోసం రండి మీ ప్రేమ నాకు కావలి…
చిన్నతనంలో దొంగిలింపబడి పెద్దవాడై.. గుంటూరు అర్బన్ ఎస్పీని ఆశ్రయించిన యువకుని కథ.
అమరావతి వార్తలు :
అమ్మ నాన్న నన్ను గుర్తిస్తే నా కోసం రండి మీ ప్రేమ నాకు కావలి అంటూ తన ఆరు సంవత్సరాల వయసులో యాచకులచే దొంగిలింపబడ్డ యువకుడు గుంటూరు అర్బన్ ఎస్పీ సి హెచ్.విజయరావు ఐపిఎస్ ని ఆశ్రయించిన సంఘటన గుంటూరు అర్బన్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ నందు చోటు చేసుకుంది. బాలుడు బాధను చూసిన ఎస్పీ చలించి మానవత దృక్పధం తో సత్వరమే స్పందించి సంభందిత యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ అధికారులచే ఆ వ్యక్తి తెలిపిన గుర్తుల ఆధారంగా బాలుడిని ఆతని తల్లి దండ్రుల వద్దకు చేర్చాలని ఆదేశాలు జారి చేసినారు.
ఎక్కడ పుట్టాడో తెలిదు, తల్లిదండ్రుల జాడ తెలీదు, ఎవరు తీసుకెళ్ళి ఎక్కడ వదిలారో కుడా తేలీదు ఆరు సంవత్సరాల వయసులో తన ఇంటి బయట ఆడుకుంటూ ఉండగా ఎవరో గుర్తు తెలియని ఆడ మనిషి ఆటో లో వెళ్తూ ఎత్తుకెళ్ళిన సంఘటన 18 సంవత్సరాల తర్వాత చిన్న చిన్నగా తన చిన్న నాటి జ్ఞాపకాలను బయట పెట్టాడు. తన తల్లిదండ్రులను కలుసుకోవాలని తాపత్రయం తన జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చింది.
01.02.19 న గుంటూరు అర్బన్ పోలీస్ కార్యాలయమును ఒక అరుదైన ఫిర్యాదు చోటు చేసుకుంది నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి తన ఆరేళ్ళ వయసు లో 2001 నవంబర్ నెలలో తన ఇంటి బయట ఆడుకుటుండగా అటుగా వెళ్తున్న ఆటో లోని ఒక ఆడ మనిషి తనను ఆటో లోకి లాక్కొని మత్తు ఇచ్చి తీసుకెళ్లగా తరువాత కాసేపటికి స్పృహ వచ్చి చూడగా ట్రాక్టర్ లో ప్రయానిస్తుండడం గమనించగ మళ్ళి మత్తు మందు ఇవ్వగా స్పృహ కోల్పోయానని, చీకటి పడే సమయానికి బస్సులో ఉండడం గమనించానని తెలిపాడు. తరువాత ఆ మహిళా తనను గుడిసెలు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్ళి యాచకులకు అప్పగించి అక్కడి నుండి వెల్లిపాయిందని తెలపాడు. తదుపరి సదరు యాచకులు తమతో తీసుకెళ్ళి యాచక వృత్తి చేపించ సాగారు, అలా 15 రోజులు సాగగా మరల తనను దొంగలించిన మహిళా వచ్చి తనని తీసుకొని గుంటూరు లో ఉన్న సరస్వతి సినిమా హాలు లో భద్రాచలం చిత్రం కి తీసుకెళ్ళిందని తరువాత రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కి వరంగల్ వెళ్ళగా అక్కడ వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గరలో సదరు మహిళ వదిలి వెల్లిపోయింది. ఏమి చేయాలో తెలీక బాలుడు ఇంతకు ముందు చేసిన యాచక వృతిని ద్రుష్టి లో పెట్టుకొని అడుక్కోవడం మొదలుపెట్టాడు. మూడు రోజుల నుండి బాలుడిని గమనిస్తున్న రిక్షా వాలా బాలుడిని ఒకతనికి అప్పచెప్పగా అతను బాలుడిని ఎస్ సి, ఎస్ టి హాస్టల్ లో చేర్పించి ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువును పూర్తి చేసాడు.తదుపరి చదువులకు బాలుడిని అక్కడే సాయి సేవా ట్రస్ట్ నకు అప్పచెప్పాడు.బాలుడు సాయి సేవ ట్రస్ట్ వరంగల్ వారి సహకారం తో ఇంటర్ నుండి డిగ్రీ వరకు చదువుకున్నాడు, ప్రస్తుతం డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. తనకు చిన్న తనం లో ఉన్న గుర్తులు తెలుపుతూ..
తన తల్లి పేరు లక్ష్మి దేవి, తండ్రి పేరు కొండయ్యఅని, తండ్రి రోజు నుదుటి పై నామాలు పెట్టుకొని జంధ్యం వేసుకొని సూర్య నమస్కారాలు చేసే వాడని.
తన పెద్దనాన్న ఇల్లు తన ఇంటికి కూతవేటు దూరం లో ఉంటుందని తెలిపాడు.
పెదనాన్న ఇంటి ముందు తుమ్మ చెట్లు, చింత చెట్లు ఉండేవి, పెదనాన్న ఇంటి ముందు పిండి మర, కిరాన కొట్టు ఉండేది.
తన ఇంటి చుట్టూ ప్రహరి గోడ మద్యలో డాబా ఇల్లు. తన ఇంటి దగ్గరలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండేది.
తనకు చిన్నపుడు చెయ్యి విరిగితే తన తల్లి హాస్పిటల్ కి తీసుకెళ్ళింది. పై తెలుపబడిన గుర్తులు తన ఆరవ సంవత్సరం చోటు చేసుకున్న మరియు ఉన్న గుర్తులు గా తెలిపాడు. పిల్ల వాడిని చేరదీసిన రిక్షా అతనిని , హాస్టల్ లో చేర్చిన వ్యక్తిని గుర్తు చేసుకుంటూ సాయి సేవా ట్రస్ట్ సెక్రటరీ కాళిదాసు, బ్రెషరర్ సుబ్బారావు వరంగల్ వారిని ఎస్పీ గారు అభినంధించారు.