స్టూడెంట్ ను మోకాళ్ళపై అడుక్కుంటున్న హెడ్ మాస్టర్..!
స్టూడెంట్ ను మోకాళ్ళపై అడుక్కుంటున్న హెడ్ మాస్టర్..! ఎందుకో తెలుసా..? మీరు అస్సలు ఊహించి ఉండరు..!
తరగతి గదిలో ఒక విద్యార్ది మోకాళ్లపై నేలపై కూర్చుని ఉన్నాడు.. అతడి పక్కనే హెడ్మాస్టర్ గా కూడా అదే విధంగా కూర్చుని ఆ విద్యార్దికి చేతులెత్తి దండం పెడుతున్నాడు. ఈ విధంగా ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.. ఆ స్టూడెంట్ అంటే తప్పు చేసాడని శిక్షించారనుకుందాం. మరి ఆయనెందుకు అలా కూర్చున్నారు? ఎందుకు దండం పెడుతున్నారు..? ఇంతకీ ఆయనెందుకు దండం పెడుతున్నారో తెలిస్తే మనం ఆయనకు చేతులెత్తి దండం పెడతాం..!
విల్లుపురంలోని ప్రభుత్వ పాఠశాలకు హెడ్మాస్టార్ గా పనిచేస్తున్నారు బాలు. వయసు 56 సంవత్సరాలు, 30 ఏళ్ళుగా ఉపాధ్యాయ వృత్తిలో వున్నారు. చదువు మీద ఆసక్తి లేక మానేసిన పిల్లలు, బడికి ఎగనామం పెట్టి తిరిగే పిల్లలు, చదువును నిర్లక్ష్యం చేసే పిల్లల ఇళ్ళకు ఆయన ప్రతిరోజూ వెళతాడు.
విచిత్రం ఏమిటంటే ఆ పిల్లలను చదువుకోమని ప్రాధేయపడతాడు. ఎంతకీ వినకపోతే చేతులు పట్టుకుని బతిమలాడుతాడు. అప్పటికీ దారికి రాకపోతే విద్యార్ధుల కాళ్ళు పట్టుకుని చదువుకోండిరా బాబూ అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఆ ఫోటోలో ఉన్న కుర్రాడు 12వ తరగతి చదువుతున్నాడు. స్కూలుకు రాకుండా డుమ్మాలు కొట్టే విద్యార్దిని చదువుకోమని బతిమిలాడుతున్నారు.. విల్లుపురం చుట్టుపక్కల అంతా మత్స్యకార గ్రామాలే చదువుకోకుండా పనులోకెళ్లే పిల్లల్ని తీసుకొచ్చి బాలు మాష్టారు చదువు చెప్పించడంతో వారిలో కొందరిప్పుడు ఇంజినీర్లు, డాక్టర్లుగా ఉన్నారు..
గతంలో ప్లస్ 2 ఫలితాల్లో 25 శాతం మాత్రమే ఉండే ఉత్తీర్ణత, ఇప్పుడు అది 65 శాతానికి పెరిగిందంటే అది ఖచ్చితంగా బాలు సర్ కృషి వలనే అని చెప్పొచ్చు. విద్యార్ధులను ప్రాధేయపడడం తాను అవమానకరంగా భావించరట.. అలా తన దగ్గర శిక్షణ పొందిన విద్యార్ధులంతా ఉన్నతస్థాయిలో వుండడం కంటే సంతోషమేముంటుందని సంబరపడుతుంటారు.. గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరా.. అనే మాటలకు అర్దాలు మారిపోతున్నాయి.. గురువులంటే జోకర్లుగా చూపించే సినిమాలు, సీరియళ్లు ఒకవైపు.. చదువు కొనుక్కునే పరిస్థితిరావడం.. విద్యారంగంలో వచ్చిన అనేక మార్పులు, వారు పెరిగిన పరిస్థితులు విద్యార్దులకు చదువుపట్ల, గురువు పట్ల గౌరవం లేకుండా చేస్తున్నాయి. పిల్లలు స్కూలుకి రాకపోతే బెత్తం పట్టుకునే మాష్టార్లను చూసాం కానీ, చేతులెత్తి దండం పెట్టే మాష్టారుండడం నిజంగా గ్రేట్ కదా.. హ్యాట్సాఫ్ సర్