ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్‌ను తీసుకొనేందుకు నిరాకరించిన అధికారులు…
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్‌ను తీసుకొనేందుకు నిరాకరించిన అధికారులు…
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ పాల్ ఆలస్యంగా రావడంతో అధికారులు ఆయన నామినేషన్ ను తీసుకోలేదు. అయితే కే.ఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. నామినేషన్ వేసేందుకు వచ్చిన తనకు అక్కడి అధికారులు సమయం అయిపోయింది అంటూ… అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రతినిధి పూర్తి పత్రాలతో మధ్యాహ్నం 2. 40 గంటల సమయంలో ఎన్నికల అధికారుల వద్దకు చేరుకొన్నారని, తాను కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్నప్పటికీ సమయం మించిపోయిందంటూ తన నామినేషన్‌ను తిరస్కరించారని, ఈ విషయాన్ని ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు పాల్.
తాను నామినేషన్ వేయకుండా వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారని, తాను భీమవరంలో పోటీ చేస్తున్నాననంటే పవన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు.
నర్సాపురం పార్లమెంటు స్థానంలో విజయం సాధించిన వెంటనే ఆ నియోజకవర్గాన్ని నార్త్ అమెరికాలా మార్చేస్తాన్నారు.
అన్ని వసతులతో కూడిన అధునాతన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. అంతేకాక… నర్సాపురంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. తన పార్టీ గుర్తు హెలికాప్టర్ ను చూసి, ఫ్యాన్‌కు ఓట్లు పడవని జగన్ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు కే.ఏ.పాల్