తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు జారీ…
తెలంగాణ అసెంబ్లీ కి జరిగిన ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలిచిన కేసీఆర్, తన ఎన్నికల అఫిడవిట్‌లో ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారని రాష్ట్ర హైకోర్టులో… గజ్వేల్‌కు చెందిన శ్రీనివాస్ అనే ఓటరు పిటీషన్ దాఖలు చేసారు. కేసీఆర్ పై 64 క్రిమినల్ కేసులు ఉండగా… మొదటి అఫిడవిట్‌లో కేవలం 4 కేసులు మాత్రమే చూపారని పిటీషనర్ పేర్కొన్నారు.
తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందున కేసీఆర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడుగా ప్రకటించాలని పిటీషనర్ కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కేసీఆర్‌కు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నోటీసులు జారీ చేస్తూ… నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలి అంటూ ఆదేశించింది.