నారా లోకేష్ నామినేషన్ చెల్లదు…
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న స్థానాల్లో మంగళగిరి కూడా ఒకటి,కారణం తెదేపా అభ్యర్థిగా మంత్రి నారా లోకేశ్ పోటీలో ఉండటమే… అయితే లోకేష్ దాఖలు చేసిన నామినేషన్‌పై రిటర్నింగ్ అధికారి అభ్యంతరం వ్యక్తంచేశారు…
కృష్ణా జిల్లాకు చెందిన నోటరీ జారీ చేసిన పత్రాలు… గుంటూరు జిల్లాలో చెల్లుబాటు కావు అంటూ… అభ్యంతరం తెలిపారు. నోటరీ చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం ఆయన దాఖలు చేసిన నామినేషన్ చెల్లదని పేర్కొన్నారు.
అయితే… నారా లోకేశ్‌కు రిటర్నింగ్ అధికారి 24గంటల గడువు ఇచ్చారు, ఈ లోగా సరైన పత్రాలను సమర్పిస్తే ఎన్నికల సంఘానికి నివేదించి మరోసారి పరిశీలిస్తామని రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు..
నారా లోకేశ్ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వైకాపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇదే స్థానం నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు…