ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో…. టీడీపీ కి -125 , జనసేనకు – 42
లోక్ సభ మొదటి దశ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు జరుగనున్న ఎన్నికలకు, నామినేషన్ల పర్వం నిన్న సాయంత్రం 3 గంటలతో…ముగిసింది.
ఈ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి తక్కువ వ్యవధి ఉండటం… అన్ని రాజకీయ పార్టీలు చివరి నిమిషం వరకు తమ అభ్యర్ధులను పూర్తి స్థాయిలో ప్రకటించక పోవడంతో… ఆఖరిరోజు భారీ సంఖ్యయలో నామినేషన్లు దాఖలు అయ్యాయి.
నేటి నుంచి నామినేషన్ల పరిశీలన జరుగనుండగా… మార్చి 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది.
దేశంలో మొట్టమొదటి సారి, సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే ప్రచారాన్ని కూడా ఎన్నికల సంఘం తన సోషల్ మీడియా మానిటరింగ్ టీం ద్వారా పర్యవేక్షిస్తోంది…
ఎన్నికల సంఘం ఇప్పటి వరకు రాష్ట్రంలోని పార్టీలకు 367 నోటీసుల జారీ చేశారు ఎన్నికల అధికారులు..
అందులో టీడీపీకి 125, వైసీపీ 142, జనసేన 42, బీజేపీకి 15 నోటీసులు జారీ చేశారు.
ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కూడా పార్టీలకు నోటీసులు ఇచ్చామన్నారు ఏపీ సీఈవో ద్వివేది..
ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు సంబంధించి తెదేపా అభ్యంతరాలు, ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించామని, న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకొని త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు ద్వివేది. అసలు ఈ విషయానికి, ఎన్నికల సంఘానికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.