మహబూబ్ నగర్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

?మీ చౌకీదార్ మీ ఆశీర్వాదం తీసుకోవడానికి మరోసారి మహబూబ్ నగర్ వచ్చారు.

?పేదల జీవనం మెరుగుపర్చేందుకు గత ఐదు సంవత్సరాలు నిజాయితీగా కృషి చేశాను..

?ఈ ఎన్నికల్లో మీరు ఓటు ఎంపీ కోసం కాదు.. నవ భారతం కోసం ఓటు వేయబోతున్నారు..

?ఇప్పుడు ఉగ్రవాదం కేవలం కశ్మీర్ కే పరిమితమైంది. గతంలో దేశంలో బాంబు పేలుళ్లు చాలా చూశాం. ఈ ఐదేళ్లలో ఒక్క బాంబు పేలుడు చోటు చేసుకోలేదు.

?కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎంత తొందరపడ్డారో… అంత ఆలస్యంగా మంత్రివర్గం ఏర్పాటు చేశారు.

?మూడు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.. అవే అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలతో జరిగితే కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయ్యేది కాదా..?

?తెలంగాణలో జ్యోతిష్యులు చెప్పినట్టు పాలన సాగుతుంది. తెలంగాణ భవిష్యత్తును ఎవరు నిర్ణయించాలి..? తెలంగాణ ప్రజలా.. లేక జ్యోతిష్యులా..?

?ఏప్రిల్, మే నెలల్లో మోదీ స్టార్ బాగా నడుస్తుందని కేసీఆర్‌కు జ్యోతిష్యులు చెప్పారు. ఆ సమయంలో మోదీ చరిష్మాను తట్టుకోలేరని, మే నెలలో ఒకేసారి ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని కూడా చెప్పారు. అందుకే కేసీఆర్ తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు

?ప్రజలకు సేవ కోసం కాకుండా.. స్వార్థం కోసం రాజకీయాలు నడిపింది కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ అడుగుజాడుల్లోనే ఇప్పుడు టీఆర్ఎస్ నడుస్తుంది. ఈ రెండు పార్టీలు ఒకటే.. తమ కుటుంబం కోసమే పని చేసే పార్టీలే..

?నీతిమాలిన రాజకీయాలకు, అవినీతి, కుంభకోణాలకు పెట్టింది పేరు.. కాంగ్రెస్. ఆ పార్టీ మన సైనికులు అత్యంత సాహసోపేతంగా చేపట్టిన వైమానిక దాడులకు రుజువులు అడిగేంత స్థాయికి దిగజారడం దురదృష్టకరం.

?తెలంగాణ రాష్ట్రం వల్ల కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడింది. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడికు పదవులిచ్చారు.

?మహబూబ్ నగర్ నుంచి ఎన్నికైన కేసీఆర్ పాలమూరు బిడ్డలకు అన్యాయం చేశారు. వారు ఎవరికైనా న్యాయం చేశారంటే.. అది వారి కుటుంబ సభ్యులకే..

?కేసీఆర్ మహబూబ్ నగర్ ను గాలికొదిలేయడం వాస్తవం కాదా..? కుటుంబ పాలన, సంతుష్టీకరణకు కేసీఆర్ మరో రూపం.. టీఆర్ఎస్, ఎంఐఎం పొత్తు తెలంగాణ కోసం కాదు.. వారి స్వార్థం కోసమే.. రాజ్యాంగంలో లేని ముస్లిం రిజర్వేషన్లను కేసీఆర్ ప్రతిపాదించడం ఎవరి మేలు కోసం..?

?ఎన్డీఏ ప్రభుత్వంలో తెలంగాణలో నేషనల్ హైవేలు, రైల్వే లైన్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. మునీరాబాద్-సికింద్రాబాద్, సికింద్రాబాద్- మహబూబ్ నగర్ డబ్లింగ్ పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. కానీ ఇక్కడి ప్రభుత్వం ఈ పనులకు ఆటంకం సృష్టిస్తుంది.

?ఇక్కడి ప్రభుత్వం ఎన్డీఏ పథకాలకు టీఆర్ఎస్ ముద్ర వేసుకొని ప్రచారం చేసుకుంటుంది. పేదల ఇండ్ల కోసం మేం అవాస్ యోజన తీసుకొస్తే.. మేం డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తామన్నారు. దేశంలో కోటి యాభై లక్షల మందికి ఇళ్లు కట్టించాం.. మరి, ఇక్కడి ప్రభుత్వం ఎన్ని ఇళ్లు కట్టించింది.?

?దేశవ్యాప్తంగా 50 కోట్ల నిరుపేదలకు ఏడాదికి రూ.5 లక్షల ఉచిత వైద్యం అందేలా ‘ఆయుష్మాన్ భారత్’ పథకం ప్రవేశపెడితే.. ఇక్కడి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడానికి నిరాకరిస్తోంది.

?2014 నాటికి దేశంలో కేవలం 40 శాతం మందికి మాత్రమే మరుగుదొడ్డి వసతి ఉండేదు. కానీ ఈ చౌకీదార్ దేశంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టించే పని పూర్చి చేశారు. ఇప్పుడు దాదాపు దేశంలో 98 శాతం నివాసాల్లో మరుగుదొడ్డి వసతి ఉంది.

?పొగచూరిన వంటింట్లో మహిళలు ఎంతటి కష్టాలు పడ్డారో మనకు తెలుసు.. అలాంటి వారి కోసం మా ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది. తెలంగాణలోనూ 9 లక్షల మంది నిరుపేద మహిళలు ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందారు.

?ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు సామాజిక న్యాయాన్ని విస్మరించి రిజర్వేషన్లను కేవలం చిచ్చు పెట్టేందుకే వాడుకుంది. మేము మాత్రం రిజర్వేషన్ల ఫలాలు లేని ఆర్థికంగా వెనకబడిన వర్గాలను ఆదుకునేందుకు ప్రభుత్వ విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాం.

About The Author