ప్యాసింజర్ రైళ్ల రద్దు…SCR
ఏప్రిల్ 1 నుంచి 5 వరకు… అని తెలిపిన రైల్వే అధికారులు
కాజీపేట-కొండపల్లి రైల్వే స్టేషన్ల మధ్య జరిగే రైల్వే మరమ్మతులే కారణం
కాజీపేట : వచ్చే ఐదు రోజులు కొన్ని ప్యాసింజర్ రైళ్ల రద్దు కానున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…ఏప్రిల్ 1 నుంచి 5 వరకు పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు అవనున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట-కొండపల్లి రైల్వే స్టేషన్ల మధ్య జరిగే రైల్వే మరమ్మతు పనుల దృష్ట్యా రైళ్ళను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా రద్దు అయిన వాటిలో…
కాజీపేట-మణుగూర్ మధ్య నడిచే (57657-) మణుగూర్ ప్యాసింజర్ అప్ అండ్ డౌన్.
కాజీపేట-అజ్నీ మధ్య నడిచే అజ్నీ ప్యాసింజర్ (57135 -) అప్ అండ్ డౌన్. ఈ రెండు రైళ్లను ఈ నెల 5వ తేదీ వరకు రద్దు చేశారు. కాజీపేట – విజయవాడ మధ్య నడిచే విజయవాడ ప్యాసింజర్ (57237) రైలును ఈ నెల 2 వరకు మాత్రమే రద్దు చేశారు.
బల్లార్ష – కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య నడిచే రామగిరి ప్యాసింజర్ (67204) రైలు బల్లార్ష నుంచే వచ్చే డౌన్ ట్రిప్పును మాత్రమే సోమవారం రద్దు చేశారు.
ఈ మార్గం గుండా ప్రయాణాలు చేసే రైలు ప్రయాణీకులు రద్దు అయిన రైళ్ల వివరాలను గమనించాలని రైల్వే అధికారులు పేర్కొన్నారు.