న్యాయం కోసం 765 రోజులుగా ఓ తమ్ముడి పోరాటం…
న్యాయం కోసం 765 రోజులుగా ఓ తమ్ముడి పోరాటం..
మీరు చూస్తున్న పిక్స్ కేరళ సచివాలయం కాంపౌండ్ వాల్ దగ్గరవి…
నైరాశ్యంగా కూర్చున ఈ కుర్రాడి పేరు #శ్రీజిత్..
కేరళలో మద్యతరగతి జీవనం కొనసాగిస్తున్న శ్రీజిత్ జీవితంలోకి మూడేళ్ల క్రితం ఓ వార్త కలిచివేసింది..
తన అన్న #శ్రీజీవ్ ని దొంగతనం చేశాడని ఆరోపిస్తూ పరస్సాల పోలీసులు అరెస్ట్ చేసారు.. నాలుగైదు రోజుల చిత్రహింసల తరువాత హాస్పటల్ లో శ్రీజీవ్ చనిపోయాడు…. కస్టడీలో ఉన్నంతసేపు శ్రీజీవ్ కుటుంబ సభ్యులని కలవనివ్వకుండా చేశారు పోలీసులు….
అనారోగ్యంతో శ్రీజీవ్ హాస్పటల్ లో చనిపోయాడని పోలీసులు శ్రీజిత్ కుటుంబానికి కబురు పెట్టడంతో తన అన్న మరణవార్త విని శ్రీజిత్ కృంగిపోయాడు..
తన అన్న ది సహజమరణం కాదని , లాకప్ డెత్ అని నిజాలు నిగ్గుతేల్చేవరుకు వదలకుండా పోరాటం చేస్తూనే ఉన్నాడు…శ్రీజీవ్ మృతిపై cbi ఎంక్వౌరీ , స్పెషల్ జడ్జ్ తో విచారణ వేయాలంటూ…765 రోజులుగా కేరళా సెక్రటెరియట్ ముందు ఇలా నిరసన కొనసాగిస్తూనే ఉన్నాడు…
.
#note :
శ్రీజిత్ లాంటి సోదరులు దొరకడం చాలా అరుదు…
ఇలాంటివారికి సపోర్ట్ ఇవ్వాల్సిన కనీస ధర్మం మనది…