టిడిపి నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్…
పాల్గొన్న అభ్యర్ధులు, బూత్ కన్వీనర్లు,సేవామిత్రలు
*టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కామెంట్స్…*
పులివెందులలో నా పర్యటనకు అద్భుతమైన స్పందన
జమ్మలమడుగు,చిత్తూరు,అన్నిచోట్లా టిడిపిపై సానుకూలత
*టిడిపిపై అన్నివర్గాల ప్రజల్లో అసాధారణమైన స్పందన*
ప్రతిచోటా ప్రజల్లో వీరోచిత స్ఫూర్తి కనిపిస్తోంది
వాళ్లందరికీ టిడిపి శ్రేణులే నాయకత్వం అందించాలి
ప్రజల్లో కసిని, పౌరుషాన్ని టిడిపికి ఓట్లుగా మార్చుకోవాలి
*వైకాపాపై ఎక్కడ చూసినా తీవ్ర వ్యతిరేకత ఉంది*
ఏపికి డబ్బులు ఇవ్వడానికి మోదికి చేతులు రాలేదు
ఏపిని, టిడిపిని నిందించడానికి మాత్రం మోదికి పెద్దనోరు
*నరేంద్రమోది నిందలతో అందరిలో రోషం రావాలి, పట్టుదల పెరగాలి-పౌరుషంగా పనిచేయాలి*
మోది అహంభావానికి గుణపాఠం చెప్పాలి
ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తే మాకూ ఇవ్వాలన్న కెసిఆర్..
అలాంటి కెసిఆర్ తో కలిసి ఏపికి జగన్ హోదా తెస్తాడా..?
*పోలవరంపై పదేపదే కేసులేసే కెసిఆర్ కు జగన్ మద్దతా..?*
టిఆర్ ఎస్ 16తో కలిసి జగన్ హోదా సాధిస్తానంటే నమ్ముతారా..?
సాగర్, శ్రీశైలం మాకే ఇవ్వాలన్న కెసిఆర్ కు జగన్ సపోర్టా..?
ముచ్చుమర్రి మూసేయాలనే కెసిఆర్ తో జగన్ కుమ్మక్కు
పోతిరెడ్డిపాడు నిలిపేయాలనే టిఆర్ ఎస్ తో జగన్ లాలూచి
సీమను ఎడారిచేయాలనే కెసిఆర్ కు జగన్ మద్దతా..?
కేసుల కోసం మోదితో, ఆస్తుల కోసం కెసిఆర్ తో జగన్ లాలూచి
*సొంతలాభాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు జగన్ గండి*
అద్దెమైకులు,వలస పక్షులు వైకాపా కు మద్దతుగా ప్రచారం
ఎన్నికలు కాగానే అందరూ హైదరాబాద్ చెక్కేస్తారు.
కెసిఆర్ బెదిరింపుల వల్లే సినీనటులు జగన్ వద్దకు క్యూ..
*హైదరాబాద్ లో ఆస్తుల కోసమే జగన్ తో వైకాపా కండువాలు*
జగన్ తో వైకాపా కండువా కప్పించుకుంటేనే హైదరాబాద్ లో భద్రత
‘‘ఒక్కసారి ప్లీజ్’’ అంటూ వైకాపా మొసళ్లు తెగ కన్నీరు…
ఒక్కసారి అని తినేతిండిలో విషం కలుపుకుంటామా..?
ఒక్కసారి అని ఎవరైనా కొండపైకెక్కి లోయలో దూకుతారా..?
*తెలుగుదేశం పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ కు న్యాయం*
25మంది టిడిపి ఎంపీలు ఉంటే ప్రత్యేక హోదా సాధిస్తాం
*22పార్టీలను ఆంధ్రప్రదేశ్ కు మద్దతుగా కూడగట్టాం*
ఢిల్లీ ధర్మపోరాటంలో 22పార్టీలు ఏపికే మద్దతు
*ఇంటింటికి తిరగాలి,అందరి మద్దతు టిడిపికే సాధించాలి*
టిడిపి మిషన్ 150ప్లస్ విజయవంతం చేయాలి