మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష…
సినీ నటుడు మోహన్ బాబుకు సంవత్సరం పాటు జైలు శిక్ష విధించింది ఎర్రమంజిల్ కోర్టు. 2010 లో చెక్ బౌన్స్ కేసు పై వైవీఎస్ చౌదరి ఫిర్యాదు దాఖలు చేశారు. 40 లక్షల75 వేల చెక్ బౌన్స్ కేసు వేశారు వైవీఎస్ చౌదరి. పిటిషన్ ను విచారించిన ఎర్రమంజిల్ 23వ కోర్ట్ అసలు కంటే లక్ష 25 వేలు అదనంగా జరిమాన విధించింది.
సినీ నటుడు మోహన్ బాబుకు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. చెక్‌బౌన్స్ కేసులో కోర్టు ఆయనకు ఈ శిక్ష విధిస్తున్నట్టు తీర్పునిచ్చింది. శిక్షతో పాటు రూ.41.75 లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది. 2010లో చెక్‌బౌన్స్ కేసు వ్యవహారంలో నిర్మాత వైవీఎస్ చౌదరి కోర్టును ఆశ్రయించారు. చౌదరి దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వచ్చిన సలీం చిత్రానికిగాను నిర్మాతగా వ్యవహరించిన మోహన్‌బాబు చెక్ ఇచ్చారు. అయితే ఆ చెక్ చెల్లకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. మంగళవారం నాడు ఈ కేసు పై తీర్పు వచ్చింది.ఈ కేసులో ఏ1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్, ఏ2గా మంచు మోహన్‌బాబుగా కోర్టు తేల్చింది. ఇందుకు సంబంధించి మంచు ఫ్యామిలీ ఇంత వరకూ స్పందించలేదు. ఇటీవలే మోహన్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.