‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వర్మకు ఎదురుదెబ్బ

 

అమరావతి;- వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విషయంలో ఎదురుదెబ్బ తగిలింది.

ఏపీలో ‘లక్ష్మి ఎన్టీఆర్’ విడుదలకు సంబంధించి సుప్రీంకోర్టు తక్షణ విచారణకు నిరాకరించింది.

ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ అభ్యర్ధనను తిరస్కరించింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏప్రిల్ 3 వరకు ‘లక్ష్మీ ఎన్టీఆర్’ను విడుదల చేయరాదని ఆదేశించింది.

వెనుక రాజకీయ అజెండా ఉందని ఆరోపించిన వర్మ త్వరగా విచారించి సినిమా విడుదల అయ్యేలా చెయ్యాలని సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.

అయితే సుప్రీం కోర్టులో దీనిపై అంత త్వరగా విచారించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

About The Author