బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు ఫిట్స్..తృటిలో తప్పిన ప్రమాదం…
బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు ఫిట్స్..తృటిలో తప్పిన ప్రమాదం
కామారెడ్డి : కామారెడ్డి మండలం అడ్లూరు బైపాస్ జాతీయ రహదారి వద్ద ఓ ఆర్టీసీ బస్సుకు బుధవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదారాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న నిజామాబాద్ డిపో-2 రాజధాని బస్సు డ్రైవర్ రాంలాల్ అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో బస్సు అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న క్వాలీస్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్వాలీస్‌తో పాటు బస్సు సుమారు 100 మీటర్లు మేర దూసుకెళ్లింది. రహదారి పక్కన ఉన్న సైడ్ వాల్‌ను ఢీకొట్టి బస్సు ఆగింది. ఈ ప్రమాదంలో బస్సు, క్వాలిస్ ముందు భాగాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదం నుంచి క్వాలిష్‌లో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా.. బస్సులోని కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న వైద్యులు కొందరు అప్రమత్తమై డ్రైవర్‌ను హుటాహుటిన 108 వాహనంలో కామారెడ్డి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.