తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు …

తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషి తెలిపారు. మంగళవారం సచివాలయంలో Election Commission of India, Sr. Deputy Election Commissioner లు శ్రీ ఉమేష్ సిన్హా, సుదీప్ జైన్ లు సి.యస్ ను కలిసారు. ఈ సమావేశంలో డిజిపి మహేందర్ రెడ్డి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, జిఏడి ముఖ్యకార్యదర్శి అధర్ సిన్హా, CEO రజత్ కుమార్, Addl.CEO బుద్ధప్రకాశ్ జ్యోతి, ఆర్ధిక శాఖ అధికారి శివశంకర్, అడిషనల్ డిజి. (L&O ) జితెందర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సి.యస్ మట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు 145 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి బలగాలు కేటాయింపుపై చర్చించారు. గతంలోఎన్నడూ లేని విధంగా నిజామాబాద్ పార్లమెంటుకు 185 మంది అభ్యర్ధులు పోటి చేస్తున్నందున EVM లు ECIL, BEL నుండి వస్తున్నాయని అవసరమైన అదనపు సిబ్బంది, టేబుల్స్, ప్రజలకు అవగాహన, ఇంజనీర్ల కేటాయింపు, పోలింగ్ బూత్ లలో సౌకర్యాలు, పోలింగ్ స్టేషన్లలో Compartments తదితర అంశాలపై చర్చించామన్నారు.

నిజామాబాద్ ఎన్నికలలో వినియోగించే ఈవిఎం లపై ప్రత్యేకంగా ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. అవసరమైన అదనపు సిబ్బందిని కేటాయిస్తామన్నారు సిఈఓ రజత్ కుమార్ మాట్లాడుతూ నిజామాబాద్ ఎన్నికలకు అవసరమైన అదనపు సిబ్బంది వివరాలు సమర్పిస్తామన్నారు. పోలింగ్ బూత్ లలో చేపట్టవలసిన వసతులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈవిఎంలను Engineer లు First Level Checking చేస్తారన్నారు.

About The Author