బారాముల్లా – ఉధంపూర్ హైవే మూసివేత…
బారాముల్లా – ఉధంపూర్ హైవే మూసివేత
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా – ఉధంపూర్ హైవేను మూసివేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు ఉత్తర్వులు జారీ చేశాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా వారంలో రెండు రోజులు..
ఆదివారం, బుధవారం సాధారణ వాహనాలకు, పౌరులకు ఆ హైవేపై అనుమతి ఉండదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ రెండు రోజుల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాకపోకలను నిషేధిస్తారు.
ఈ నిషేధం మే 31 వరకు కొనసాగనుంది. ఉగ్రవాద దాడులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు.