ఆ సాధ్వీమణిని ఘనంగా సత్కరించనున్న మోడీ సర్కార్…
గత ఫిబ్రవరి 27వ తేదీన భారత్‌పై దాడి చేయాలని వచ్చిన పాకిస్థాన్ F-16 యుద్ధవిమానాల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టి సమాచారమిచ్చి పెద్ద ప్రమాదాన్ని తప్పించిన రాడార్ స్టేషన్లోని మహిళా కంట్రోలింగ్ ఆఫీసరును భారత ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది..
27వ తేదీన ఉదయం 8.45 కు పాకిస్థాన్ పౌరవిమానయాన సర్వీసులను ఆపేసింది., ఆ విషయాన్ని వెంటనే డ్యూటీలో ఉన్న మహిళా గ్రౌండ్ కంట్లోలింగ్ ఆఫీసర్ పసిగట్టారు..
ఆ తరువాత 9.15 కు 12 అమెరికా తయారీ F-16లు, 13 చైనా తయారీ JF-17 యుద్ధ విమానాలు పాకిస్థాన్‌లోని 3 ఎయిర్‌బేస్ లనుంచి భారత్ వైపు బయలుదేరాయి..
(వాటిలో అత్యాధునిక టెక్నాలజీ కలిగిన రెండు F-16లు మాత్రం LOC దాటి వచ్చాయి..)
ఆ విషయాన్ని వెంటనే పంజాబ్, శ్రీనగర్‌లలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లకు చేరవేసి అప్పటికప్పుడు రెండు సుఖోయ్_30, రెండు మిరాజ్_2000, రెండు మిగ్_21 బైసన్‌లను రంగంలోకి దింపారు..
ఈ ఆరు ఫైటర్ జెట్లు LOC దాటివచ్చిన రెండు F-16 లను LOC ఆవలికి తరిమివేశాయి..
కాగా అందులోని ఒక మిగ్ మాత్రం వాటిని వెంబడించి పాకిస్థాన్ భూభాగంలోకి తరుముకుంటూ అటే ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఆ రెండింటిలోని ఒక F-16 ను కూల్చివేసింది, అదే అభినందన్ నడిపిన మిగ్ విమానం..
కాకపోతే F-16 ఆధునికమైనదీ, మిగ్ ఆవుట్ డేటెడ్ (60 ఏళ్ళ పాతకాలం/నెహ్రూ కాలం నాటిది) కావడంతో, ఆ డాగ్‌ఫైట్‌లో అభినందన్ మిగ్ కూడా కూలిపోయింది..
అభినందన్ పట్టుబడడంతో, వెంటనే మోడీజీ రంగంలోకి దిగి అమెరికా, సౌదీల ద్వారా కరాచీపోర్టును బ్రహ్మోస్ మిస్సైళ్ళతో మరికొద్ది గంటల్లోనే నామరూపాల్లేకుండా చేస్తాం.. అని ఇమ్రాన్‌ఖాన్‌కు వార్నింగ్ ఇప్పించడంతో, అప్పటికప్పుడు అభినందన్‌ను విడదల చేస్తున్నట్లు ప్రకటించారు, అంతేకాకుండా ఆయనను తాము చాలా బాగా చూసుకుంటున్నట్లు, ఆయన ఠీవీగా కాఫీ తాగుతున్న వీడియోను కూడా రిలీజ్ చేశారు..
ఆ తరువాత జరిగిన విషయాలు తెలిసిందే..
కాగా నిబంధనల ప్రకారం ఆమె పేరును బైటపెట్టకూడదు కావున ఆమె పేరు ఇంకా బయటకు రాలేదు..