“కలరి” ప్రపంచంలోని అత్యంత పురాతనమైన మార్షల్ ఆర్ట్స్ లో ఒకటిగా…

https://www.facebook.com/2249905521816331/posts/2660566954083517/

కలరి – Kalari :

ప్రపంచంలోని అత్యంత పురాతనమైన మార్షల్ ఆర్ట్స్ (Martial Arts ) లో ఒకటిగా ఈ ” కలరి ” ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది . దీనిని ‘కలరి పయట్టు’ – Kalari Payattu అనికూడా వ్యవహరిస్తారు. వీరత్వానికి ప్రతీకగా భాసిల్లే సమర కళ ఈ “కలరి”. విశ్వవిఖ్యాతమైన ఈ కలరి ఓ మర్మ కళ, యుద్ధ కళ. “కలోరికా” అనే సంస్కృత పదం నుండి ఆవిర్భవించింది ఈ కలరి. కలోరికా అంటే సైనిక శిక్షణా బరి అని అర్ధం. ధనుర్వేదం ఈ విద్యకు మూలం .

పురాతన తాళపత్ర గంధ్రాల ప్రకారం పూర్వాపరాలను పరిశీలిస్తే పరశురాముడు ఈ విద్యకు ఆది గురువు అని చెప్తారు. తమ జన్మభూమిని రక్షించుకోవడం తో పాటు శాంతి స్థాపనకు 21మందికి శిశులకు ఈ కలరి విద్యను భోదించాడని చెప్తారు. వారినుండి తర తరాలుగా ఈ కలరి కళ వ్యాప్తి చెందినది.

కేరళ రాష్ట్రం లోని పలు ప్రాంతీయుల విద్యాభ్యాసం లో ఒక భాగం ఈ ‘కలరి’. ఈ విద్యను పూర్వం ఇతర శాస్త్రాలతో పాటు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నేర్చుకునే వారు. ఈ విద్య పిల్లల లోని అన్ని చేదు ప్రభావాలని తొలగిస్తుంది. వారిని క్రమశిక్షణతో కూడిన పరిపూర్ణ వ్యక్తులు గా తయారు చేస్తుంది.

శారీరక, మానసిక , ఆధ్యాత్మిక శక్తుల కలయిక యే ప్రధానాంశంగా సుమారు 2వేల సంవత్సరాల కు పూర్వం ఏర్పడిన ఈ గురుకుల వ్యవస్థ లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు వేకువ ఝాముననే శరీరానికి తైలాన్ని మర్దనా చేసుకుని, నడుమునకు లంగోటి ని ధరించి శిక్షణా బరిలోకి ప్రవేశిస్తారు.

ఇంత చక్కటి విద్యలు మన దేశంలో ఉండడం చాలా గర్వించదగ్గ విషయం. ఇటువంటి అరుదైన, అతి పురాతనమైన కళలను తిరిగి ప్రాచుర్యం లోకి రావాలని ఆశిద్దాం.

About The Author