రాష్ట్రంలో ఇసుక, మట్టి మొదలు.. అన్నింటిలోనూ టీడీపీ నేతలు దోపిడి…


చిత్తూరు:
రాష్ట్రంలో ఇసుక, మట్టి మొదలు.. అన్నింటిలోనూ టీడీపీ నేతలు దోడిపీకి పాల్పడుతున్నారని, ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో జాతీయ హరిత ట్రిబ్యునల్‌ చంద్రబాబు సర్కారుపై 100 కోట్ల రూపాయల జరిమానా విధించిందని, ఇంతకన్నా సిగ్గుచేటు ఏముంటుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో విజయమ్మ ప్రసంగించారు. ఈ సందర్భంగా పూతలపట్టు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎంఎస్‌ బాబు, చిత్తూరు ఎంపీ అభ్యర్థి నల్లకొండగారి రెడ్డప్పలను ప్రజలకు పరిచయం చేసి.. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి.. వారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే.. 108 అంబులెన్స్‌ కూతలు మళ్లీ వినిపిస్తాయని, ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా కోసం మొదటినుంచి పోరాటం చేస్తోంది వైఎస్సార్‌సీపేనని గుర్తు చేశారు. 25 ఎంపీ స్థానాలు గెలిపించండి..ప్రత్యేక హోదా సాధించుకుందామని పిలుపునిచ్చారు.

About The Author