కౌంట్ డౌన్ స్టార్ట్ … చెకింగ్స్ పెంచండి: కలెక్టర్
కలెక్టరేట్ కాన్ఫెరెన్సు హాల్ లో వంద మంది సిబ్బంది తో పోల్ మేనేజ్మెంట్ సిస్టం కేంద్రం ఏర్పాటు
పోలింగ్ తేదీ:11-4-2019
పోలింగ్ సమయం: ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు
పోలింగ్ రోజున స్థానిక సెలవు
ఓటర్లందరూ….ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించండి
ఓటర్లను ప్రలోభాలకు, భయబ్రాంతులకు గురిచేసినా, డబ్బు, మద్యం ఇతరత్రా పంపిణీ చేసినా టోల్ ఫ్రీ 1950 కాల్ సెంటర్ కు లేదా సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయండి
ఈ నెల 7 న పిఓలు, ఏపిఓ లకు శిక్షణ మరియు పోస్టల్ బ్యాలెట్ ద్వారా పిఓలు, ఏపిఓ లు తమ ఓటు హక్కు వినియోగానికి చర్యలు
ఈ నెల 10 న పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రాల వద్ద ఓపిఓలు, పిఓలు, ఏపిఓ లు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవడానికి ఏర్పాట్లు
చిత్తూరు, ఏప్రెల్5: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పార్లమెంటు మరియు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 11న ఉదయం 7 నుండి సాయంత్రం 6 వరకు జరగనుందని, పోలింగ్ రోజున ఓటర్లందరూ తమ ఓటుహక్కును వినియోంచుకోవడానికి వీలుగా ఈ నెల 11 న స్థానిక సెలవు గా ప్రకటించడం జరిగిందని