తిరుమలలో భక్తుల సౌకర్యాలను పరిశీలించిన జెఈవో …
తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అన్నప్రసాద భవనం, కల్యాణకట్ట, నందకం వసతిగృహం, పిఏసి-2 తదితర ప్రాంతాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను శుక్రవారం రాత్రి టిటిడి తిరుమల ఇన్చార్జి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం పరిశీలించారు.
అనంతరం జెఈవో మీడియాతో మాట్లాడుతూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో పిలిగ్రిమ్ ఇన్ఫర్మేషన్ సెల్ ద్వారా భక్తులకు ఎలాంటి సమాచారం ఇస్తున్నారనే విషయాన్ని పరిశీలించామన్నారు. అదేవిధంగా, ఎన్ని కంపార్ట్మెంట్లు ఉన్నాయి, దర్శనానికి ఎంత సమయం పడుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ఎలా బయటకు వెళ్లాలి, తిరికి ఎలా రావాలి, అన్నప్రసాదాలు, పాలు సమయానికి అందుతున్నాయా, మరుగుదొడ్ల వద్ద పారిశుద్ధ్యం ఎలా ఉందనే అంశాలను పరిశీలించినట్టు తెలిపారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తుల సూచనలను పరిగణలోకి తీసుకుని తగిన చర్యలు చేపడతామన్నారు. అన్నప్రసాద భవనంలో భక్తులకు ఎలా వడ్డించాలి, ఎలా వ్యవహరించాలి అనే విషయాలపై శ