మీడియా సాక్షిగా చరిత్ర సృష్టించిన విశాఖ జనసేన MP…
మీడియా సాక్షిగా చరిత్ర సృష్టించిన విశాఖ జనసేన MP అభ్యర్థి V V లక్ష్మి నారాయణ (JD) గారి ప్రత్యేక వైజాగ్ మేనిఫెస్టో : అన్ని వర్గాల నుండి మద్దతు.
నిజంగానే రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న శ్రీ V V లక్ష్మి నారాయణ (JD) గారి ప్రత్యేక వైజాగ్ మేనిఫెస్టో. శబాష్ అని అంటూ ఆశీర్వదిస్తున్న ప్రజానీకం. చెప్పిన విధంగానే మాట నిలబెట్టుకున్న శ్రీ V V లక్ష్మి నారాయణ.
భారత దేశ చరిత్ర లోనే ఏ MP కూడా ఇప్పటివరకు, ఎవ్వరు కూడా చేయని నిస్వార్ధ సాహసం చేసారు విశాఖ ప్రజల కోసం.విశాఖ ప్రజలకు ఏమికావాలో, వారి సమస్యల అన్ని తెలుసుకుని 100 రూపాయల బాండ్ పేపర్ మీద ఈ సమస్యలు రాసి “లక్ష్మి నారాయణ అనే నేను .. నా హామీలు అని” అయన వైజాగ్ లో ఎక్కడ నివాసం ఉండబోతున్నారో అడ్రస్ తో సహా రాసి, అందరి సమక్షం లో సంతకం పెట్టారు. అన్నిటికన్నా ముఖ్యం గా సాక్షి సంతకాలు కోసం మీడియా ప్రతినిధులను రమ్మనమని వారిచేత పెట్టించారు. ఇది కనీ, వినీ ఎరుగని స్వచ్ఛ పాలిటిక్స్. ఇంతకన్నా విశాఖ ప్రజలకు ఏమి కావాలో మీరే ఆలోచించండి.
నేను హామీలు అమలు చేయకపోతే నన్ను జైలు కు పంపండి అని చెప్పిన ఏకైక జనసేన రాజకీయ జనతా దోస్త్ మన లక్ష్మి నారాయణ గారు. హామీలు అన్ని నేను ఎలాగా నెరవేరుస్తానో మీకు మూడు నెలలకు ఒక సారి ప్రెస్ మీట్ పెట్టి ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా మీరు చూసుకోవచ్చు అని నొక్కి వక్కాణించారు. దీనికి అనుబంధం గా “Reach Your MP” మొబైల్ యాప్ ను ప్రారంభిస్తాను అని చెప్పారు.
అందరూ ఈ మేనిఫెస్టో చూడవలసిందే, చూసి అందరికి షేర్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
విశాఖ ప్రజలారా ….డబ్బు తో, వార సత్వ రాజకీయాలతో మిమ్మల్ని కొనాలని , మీ అభివృద్ధిని మీకు తెలియకుండా తొక్కుతున్న ఇతర రాజకీయ నాయకులు కావాలో లేదా పోలీస్ శాఖలో లో IPS గా ఉండి నీతి, నిజాయితో పారదర్శక తో పని చేసి ఎన్నో కేసులను ఛేదించి డబ్బుకు, బెదిరింపులకు లొంగకుండా ఉండి మనకోసం 7 సంవత్సరాల ముందు సర్వీస్ ను వదులుకుని, అదే పారదర్శకత ఖద్దర్ లో చూపిస్తాకి వస్తున్న మన శ్రీ V V లక్ష్మి నారాయణ (JD) గారు కావాలో ? మీరే అలోచించి ఈ మెసేజ్ మరియు, మేనిఫెస్టో ని అందరికి షేర్ చెయ్యండి. పవన్ కళ్యాణ్ గారిని , శ్రీ వి.వి లక్ష్మీనారాయణ గారిని, జనసేన అభ్యర్థులు అందర్నీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రజలకు ఎంతైనా ఉంది.