సైన్సు కనుక్కోలేని సత్యాలు…


అప్పట్లో : బావి,ఏటిలోని నీటిని తోడి డైరెక్ట్ గా తాగేసి వందేళ్లు బతికేవారు.
ఇప్పుడు : ఫిల్టర్డ్ RO నీళ్లు తాగినా 40ఏళ్ళకే జబ్బులు.

అప్పట్లో : గానుగ నుండి తీసిన మురికి నూనెని వాడి కూడా ముసలయ్యేదాకా శ్రమించగలిగేవారు.
ఇప్పుడు : డబుల్ ఫిల్టర్డ్ నూనెలు వాడుతూ కూడా గుండెపోటుతో హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు.

అప్పట్లో : Raw Salt వాడి బ్రహ్మాండంగా బతికేవారు.
ఇప్పుడు : అయోడిన్ ఉప్పు వాడుతూ కూడా బీపీ సమస్యలు.

అప్పట్లో : బొగ్గు,ఇటుక,వేప పుల్లలు వాడుతూ 80ఏళ్ల వరకూ నమిలి తినేయగల కెపాసిటీ.
ఇప్పుడు : సూపర్ బ్రాండ్ టూత్ పేస్ట్ లు వాడుతూ కూడా డెంటిస్ట్ దగ్గర క్యూ లు.

అప్పట్లో : నాడి చూసి రోగమేంటో తెలుసుకోగలిగేవారు.
ఇప్పుడు : ఆల్ట్రాసౌండ్,CT స్కానింగ్,బ్రెయిన్ మేపింగ్,డిజిటల్ ఎక్స్ రే లతో కూడా రోగమేంటో నిర్ధారించలేకపోతున్నారు.

అప్పట్లో : 10మంది సంతానం కని, వృద్ధాప్యంలో కూడా పొలం పనులకు వెళ్లే మహిళలు.
ఇప్పుడు : మొదటి నెల నుండి డాక్టర్ పర్యవేక్షణలో ఉండి కూడా సిజేరియన్ తప్పట్లేదు.

అప్పట్లో : సంవత్సరం పొడుగునా మిఠాయిలు తింటూ ఉల్లాసంగా ఉంటే..
ఇప్పుడు : స్వీట్ పేరెత్తితే చాలు.. మధుమేహం వచ్చేసే పరిస్థితి.

అప్పుడు : కీళ్లనొప్పులే లేని వృద్ధులు.
ఇప్పుడు : యవ్వనంలోనే మోకాళ్ళు,నడుము నొప్పులు.

అప్పుడు : చీకట్లో ఉంటూ, తక్కువు వెలుతురులో చదువుకున్నా లేని కంటి సమస్యలు.
ఇప్పుడు : చంటి పిల్లలకు కూడా కళ్ళద్దాలు.

ఇంతకీ..మనది విజ్ఞాన యుగమా లేక అవిజ్ఞాన యుగమా.

About The Author